లావణ్య త్రిపాఠి చేతిలో ప్రస్తుతం సినిమాలు లేవు. ఈమధ్య కొద్దిగా ఫ్లాపులు రావడంతో సినిమాలు తగ్గాయి. ఆఫర్లు కూడా పెద్దగా లేవు. అర్జున్ సురవరం పూర్తి చేసింది. ఈ సినిమాపై పెద్ద ఆశలే పెట్టుకుంది. కానీ.. సినిమా రిలీజ్ ఆలస్యమవుతోంది. అయితే ఇందుకు నిరాశపడకుండా తనకున్న కొన్ని ఇష్టాలకు మరింత పదును పెడుతోంది. అనుకున్నదే తడవుగా తనకిష్టమైన డ్యాన్స్ పై దృష్టి సారించింది.

 

తనకు దొరికిన ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించింది. దీంతో ముంబయిలో లాటిన్ డ్యాన్స్ నేర్చుకుంటోంది. ఓ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వూలో ఈవిషయాన్ని రివీల్ చేసింది. స్వతహాగా భరతనాట్యకారిణి అయిన ఈ అందాల రాక్షసి తనలోని డ్యాన్సింగ్ స్కిల్స్ కు మరింత పదును పెట్టుకుంటోంది. కొత్త కొత్త కళలు నేర్చుకుంటే ఫన్ కూడా ఉంటుంది కూడా కదా అంటోంది. లాటిన్ డ్యాన్స్ అంటే కమర్షియల్ డ్యాన్స్ మూమెంట్స్ కు ఈజీగా ఉంటుందని చెప్తోంది. జాజ్, సాల్సా డ్యాన్స్ మిక్సింగ్ తో ఈ డ్యాన్స్ ఉంటుందని చెప్తోంది.

 

సినిమా నటులు తమ ఖాళీ సమయాల్లో ఇలాంటి ఏదొక కొత్త కొత్త కళలను నేర్చుకోవటం కామనే. కొందరు జిమ్ మీద పడతారు. కొందరు తమ బిజినెస్ ను అభివృద్ధి పథంలో నడిచేందుకు ప్రణాళికలు వేస్తారు. మరికొందరు ఫారిన్ ట్రిప్ లు వేస్తారు. లావణ్య ఈ డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల సినిమాల్లో డ్యాన్స్ మూమెంట్స్ ఈజీ అవుతాయి అమ్మడికి.


మరింత సమాచారం తెలుసుకోండి: