నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే వారు కొంత రిలాక్షేషన్ కోరుకుంటారు. ఏ వెకేషన్ కో వెళ్లాలని ప్లాన్ చేస్తారు, కొంత సేద తీరుతారు. మరి సినిమావాళ్ల విషయంలో ఇది కాస్త ఎక్కువగానే ఉంటుంది. నిత్యం షూటింగులు, లాంగ్ షెడ్యూల్స్, అభిమానులు, ఈవెంట్స్ అంటూ తీరికలేకుండా ఉండటంతో ఏ విదేశాలలోనో వాలిపోయి సరదాగా గడుపాలనుకుంటారు. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ చేస్తోందదే..!

 

ఇటివలే అక్షయ్ కుమార్ తో చేస్తున్న సూర్యవంశీ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. షూటింగ్ నుంచి ఖాళీ టైమ్ దొరకడంతో ఇండియన్ హీట్ నుంచి తప్పించుకోవాలని వెకేషన్ కి మెక్సికో ఎగిరిపోయింది. అక్కడ బీచ్ ల్లో ఎంజాయ్ చేస్తోంది. అక్కడి బీచ్ లో దిగిన ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో కత్రినా చాలా అందంగా, లెఫ్ట్ యాంగిల్ లో ఓర చూపుతో చూస్తూ ఇచ్చిన స్టిల్ సింపుల్ గా కైపెక్కించేలా ఉంది. వెనుక నీలి సముద్రానికి తగ్గట్టు కత్రినా వేసిన బ్లూ కలర్ బికినీ తన అందాన్ని, సెక్సీ ఫిగర్ ని మరింత ఎలివేట్ చేశాయి. కత్రినా కైఫ్ ఓరకంట చూస్తూ ఇచ్చిన ఈ స్టిల్ ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.


దీనిపై కత్రినా స్పందిస్తూ.. “ఎప్పటి నుంచో ఇలాంటి వెకేషన్ గురించి ఆలోచిస్తున్నా. సూర్యవంశీ షూటింగ్ గ్యాప్ లో కుదిరింది. అక్షయ్ తో ఈమధ్య సరైన సినిమా చేయలేదు. సూర్యవంశీ నాకు మంచి సినిమా అవుతుంది. సరదాగా సాగిపోయే పాత్ర నాది. భరత్ లో చేసిన బరువైన పాత్ర తరువాత ఇలాంటి సినిమా చేయడం ఆనందంగా ఉంద”ని అంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: