సమంత తన కెరీర్లోనే ఇప్పుడు బెస్ట్ హిట్స్ అందుకుంటోంది.  మొన్నటి వరకు హీరోలతో కలిసి సినిమాల్లో నటించింది.  దీంతో హీరోలకు పేరు వచ్చిందిగాని, హీరోయిన్ గా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు.  కమర్షియల్ హీరోలతో సినిమాలంటే హీరోయిన్లకు పెద్దగా స్కోప్ ఉండదు కదా.  


పెళ్లి తరువాత సమంత లైఫ్ మారిపోయింది.  హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం మొదలు పెట్టింది.  హీరోయిన్ ఓరియేంటేడ్ మూవీస్ లో యూటర్న్ సినిమా బాగా ఆడింది. ఇప్పుడు నందిని రెడ్డితో కలిసి ఓ బేబీ చేసింది.   సినిమా ఫస్ట్ షో నుంచే మంచి టాక్ వచ్చింది.  ఇప్పుడు జబర్దస్త్ వసూళ్లతో దూసుకుపోతున్నది.  


ఓ బేబీ ఇచ్చిన కిక్ తో ఇద్దరు మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.  అది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమానే.  కామెడీ ప్రధానంగా ఉన్నా అందులో థ్రిల్లింగ్ హర్రర్ కూడా ఉంటుందట.  అయితే, ఓ బేబీ లాగానే.. వీరి కాంబినేషన్లో రాబోయే కొత్త సినిమా కూడా విదేశీ చిత్రమే అని అంటున్నారు.  కామెడీ థ్రిల్లర్ గా ఫ్రెంచ్ లో వచ్చిన సినిమాను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేయబోతున్నారట.  


దీనికి సంబంధించిన కథను కూడా నందిని రెడ్డి రెడీ చేసినట్టు తెలుస్తోంది.  అంతా రెడీ అనుకుంటే పట్టాలెక్కడమే ఆలస్యం.  అయితే, ఈ సినిమా కోసం సమంత నాగచైతన్యతో కలిసి  బ్యానర్ను స్థాపించి సినిమా చేయాలని అనుకుంటున్నారని సమాచారం. మరి దీనికి నాగ్ అంగీకరిస్తారా లేదంటే అన్నపూర్ణ బ్యానర్లోనే సినిమా చేయమని చెప్తాడా.. చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: