సెలీనా జెట్లీ అందాల ఆరబోత,మా కర్మ కాలి ఈ సినిమాకి వెళ్ళడం సెలీనా జెట్లీ అందాల ఆరబోత,మా కర్మ కాలి ఈ సినిమాకి వెళ్ళడం అసలు ఇది ఉపేంద్ర సినేమానేనా...,సినిమా టైటిల్ XYZ కానీ ఈ సినిమాకి A టు Z అన్ని మైనస్ లే

వాయిస్ మొబైల్ కంపెనీలో రాజ్ కుమార్(ఉపేంద్ర) ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ ఆఫీసర్. రాజ్ కుమార్ అనుకోకుండా తన ఇంటికి వచ్చిన ప్రియా కామత్(ప్రియాంక త్రివేది) ని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. సాఫీగా సాగిపోతున్న వారి వివాహ బంధంలో చిచ్చు పెట్టడానికి రాజ్ కుమార్ కంపెనీ ఎండీ భార్యగా సోనియా రాయ్(సెలీనా జెట్లీ) ఎంట్రీ ఇస్తుంది. రాజ్ కుమార్ ని చూసి ఇష్టపడిన మనసు పారేసుకొని తనతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవాలని అనుకుంటుంది.

అదే ఆఫర్ ని రాజ్ కుమార్ ముందుంచితే తను నో అంటాడు. దాంతో రాజ్ కుమార్ పైన పగ బట్టిన సోనియా ఎలాగైనా రాజ్ కుమార్ ని లొంగదీసుకొని తన కోరిక తీర్చుకోవాలనుకుంటుంది. అందులో భాగంగానే రాజ్ కుమార్ పై ఓ కేసు పెట్టి ఇబ్బందుల్లో పడేస్తుంది. ఆ కేసు నుండి బయటకి రావడానికి రాజ్ కుమార్ ఎలాంటి ప్రయత్నాలు చేసాడు? చివరికి సోనియా రాజ్ కుమార్ ని దక్కించుకుందా? లేదా? అసలు రాజ్ కుమార్ - సోనియాకి మధ్య గతంలో ఏమన్నా సంబంధం ఉందా? అనే విషయాల్ని మీరు వెండితెరపై చూసి తెలుసు కోవాల్సిందే.

ఉపేంద్ర చేసిన అన్ని చిత్రాలలో పూర్ పెర్ఫార్మన్స్ అని చెప్పాలంటే ఈ చిత్రంతో మొదలు పెట్టాలి. నిజానికి ఈ చిత్రంలో ఉపేంద్ర పాత్రకి నటనలో ఆస్కారమున్న పాత్ర కాదు. సోనియా పాత్ర లో ప్రియాంక నటన అప్పట్లో ఆమెకు అవార్డ్ కూడా తెచ్చి పెట్టింది కాని ఈ చిత్రంలో జైట్లీ నటన ప్రేక్షకులకు తల నొప్పి తెచ్చి పెడుతుంది. అందాల ఆరబోత అయితే చేసింది కాని నటనాపరంగా ఆకట్టుకోలేదు. ఉపేంద్ర భార్య పాత్రలో కనిపించిన ప్రియాంక త్రివేది హావభావాల పొదుపు పాటించింది. కోట శ్రీనివాస రావు , షాయాజీ షిండే ఉన్నా కూడా ఉపయోగం లేకుండా పోయింది.

ఈ చిత్రం హిందీలో వచ్చిన ఐత్రాజ్ అనే చిత్రానికి రీమేక్ కావడంతో కథ కోసం పెద్దగ కష్టపడాల్సిన అవసరం రాలేదు. కాని ఆ చిత్రాన్ని దక్షిణాది నేటివిటీ కి మార్చడంలో దర్శకుడు ఘోరంగా విఫలం అయ్యారు. మక్కీ తో మక్కీ అనే కాన్సెప్ట్ ని ఏ ఫ్రేమ్ లో ను మరిచిపోకుండా కాస్ట్యూమ్ తో సహా హిందీ తో కన్నడ దించేశాడు.

నేనేం తక్కువా అన్నటు ఘంటాడి కృష్ణ తెలుగులో హిట్ అయిన పాటలను మక్కి తో మక్కి చేసేసాడు. భారీతనం కనిపించాలని అనుకున్నాడేమో వాల్యూం బాగా పెంచేసి నేపధ్య సంగీతం అందించాడు. సినిమాటోగ్రఫీ వరస్ట్. పైరసీ లో చుసిన ఇంకా బెటర్ ఫీలింగ్ ఉండేదేమో అన్నంత రేంజ్ కి సినిమాటోగ్రఫీ. డబ్బింగ్ సినిమాలకి డైలాగ్స్ రాయడం కష్టం కాని ఈ చిత్రంలో డైలాగ్స్ వినడమే కష్టం . నిర్మాణ విలువలు అసలు బాగోలేదు.

ఖర్చు పెట్టడం లేకపోతే సినిమా తీయడం ఎందుకండి? ఈ ప్రశ్న ప్రతి ప్రేక్షకుడి మదిలో కలిగేల చేసిన చిత్రం XYZ. ఈ చిత్రం గురించి ఎక్కువగా మాట్లాడుకోకపోవడమే మంచిది. అసలు వీళ్ళకి ప్రేక్షకుడు అంటే చులకన లేక సినిమాలంటే పిచ్చి అనేది అర్ధం కాదు కన్నడ లో ఫ్లొప్ అయిన సినిమాని తెలుగులో డబ్బింగ్ చెయ్యడం ఎంటండి? అంటే అక్కడ ప్రేక్షకుడికి నచ్చని చిత్రం ఇక్కడ వాళ్ళకి ఎలా నచ్చుతుంది అనుకున్నారు.

వాళ్ళు తెలివైనవాళ్ళు అనుకున్నార మన వాళ్ళు అమాయకులు అని అనుకున్నారా? లేకపోతే ఉపేంద్ర కనిపిస్తే చాలు వచ్చేస్తారు అనుకున్నారా? ఉపేంద్ర నటన సెలీనా జైట్లీ అందం కలిసి పోరాడిన సినిమాలో ఉన్న స్టుపిడిటి ని గెలవలేకపోయింది. విమర్శకులకి జీవిత భీమ ఎంత అవసరమో ఇలాంటి చిత్రాలకు వెళ్ళినప్పుడే అర్ధం అవుతుంది. ఇంతకు మించి ఈ చిత్రం గురించి మాట్లాడుకోవడం వేస్ట్.. వెళ్ళాలా?? వద్దా?? అన్న ఆలోచన అసలు వద్దు నా సలహా మాత్రం "వెళ్ళకండి".

Upendra,Priyanka,Celina Jaitley,G Ravi,Gajula Manikyala raoXYZ : ఉపేంద్ర.... ఊచకోత...

మరింత సమాచారం తెలుసుకోండి: