డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ తో సినిమా అంటే ఒకప్పుడు హీరోలంతా క్యూలు కట్టేవారు. స్పీడ్ గా సినిమాలు చేసినా అవుట్ పుట్ మాత్రం అదిరిపోయే తీసుకురావడంలో పూరిని కొట్టేవాడే లేదన్న టాక్ ఉండేది. కాని సీన్ మారింది వరుస ఫ్లాపులతో పూరి క్రేజ్ మొత్తం పోయింది.


అందుకే అతని సినిమాలు వస్తున్నాయి అంటే ప్రేక్షకులు పట్టించుకోవడం కూడా మానేశారు. అయితే సడెన్ గా పూరి ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో చేసిన ఇస్మార్ట్ శంకర్ పై అంచనాలు ఏర్పడ్డాయి. పూరి మార్క్ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయంటూ చిత్రయూనిట్ చెబుతున్నారు.   


ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్ పెద్దగా రెస్పాన్స్ రాకున్నా మాస్ ఆడియెన్స్ కు మాత్రం నచ్చేస్తున్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా నుండి మరో ట్రైలర్ వదిలారు అది కూడా లెక్కకు మించిన హాట్ సీన్స్, బూతు డైలాగ్స్ తో కట్ చేశారు. అయితే ఇదంతా సినిమా బిజినెస్ కు హెల్ప్ అయినట్టు తెలుస్తుంది. 


సినిమా ఇప్పటికే 35 కోట్ల బిజినెస్ చేసిందని తెలుస్తుంది. థియేట్రిక రైట్స్ లో (నైజాం 7.5 కోట్లు, ఆంధ్రా 6 కోట్లు) మిగతా ఏరియాలు అన్ని కలిపి 19 కోట్లు బిజినెస్ చేసిందట. ఇక మిగతా రైట్స్ రూపంలో 17 కోట్లు వచ్చినట్టు తెలుస్తుంది. సినిమాకు 20 కోట్లు ఖర్చు కాగా 15 కోట్ల టేబుల్ ప్రాఫిట్ తో పూరి సినిమా మంచి జోష్ కనబరుస్తుంది. రాం తో పూరి మొదటిసారి చేసిన ఈ ఇస్మార్ట్ శంకర్ అంతే స్మార్ట్ హిట్ కొడతాడో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: