బాలీవుడ్ హాట్ బ్యూటీ ‘క్రిష్’మూవీ హీరోయిన్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లో తన సత్తా చాటింది.  క్వాంటికో సిరియల్ తో హాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ప్రియాంక కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకుంది.  ఈ నేపథ్యంలో ప్రియాంక చోప్రా తనకన్నా పది సంవత్సరాల చిన్నవాడైన హాలీవుడ్ నటుడు, సింగర్ నిక్ జోనస్ వివాహం చేసుకుంది. వీరిద్దరి వివాహం జరిగిన తర్వాత ఎన్నో సంచలన కథనాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.  ఆ మద్య వీరిద్దరి మద్య విభేదాలు వచ్చాయని ఓ మ్యాగజైన్ కథనం రాయడం దానిపై ప్రియాంక సిరియస్ కావడం జరిగింది.

ఈ మద్య ప్రియాంక కు చెందిన బికినీ ఫోటోస్ సోషల్ మీడియాలో దుమ్మురేపాయి..ఇవి తన భర్తే తీశారని ఆమె పేర్కొంది. అమెరికాకు చెందిన ప్రముఖ మ్యాగజైన్‌ హాలీవుడ్ రిపోర్టర్స్ విడుదల చేసే ‘గ్లోబల్‌ సోషల్ మీడియా క్లైంబర్స్‌ చార్ట్‌’లో మళ్లీ ప్రియాంక చోప్రా అగ్రస్థానానికి వచ్చేసింది. దీంతో వరుసగా గత నాలుగు వారాల్లో మూడుసార్లు టాప్‌ లిస్ట్‌లో ఉండటం గమనార్హం. ఇప్పటి వరకూ మొత్తం 12 సార్లు ఈ జాబితాలో ప్రియాంక అగ్రస్థానంలో ఉండటం విశేషం. గత కొంత కాలంగా ప్రియాంకకు ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ‘ది రాక్‌’ డ్వేన్‌ జాన్సన్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌, యూట్యూబ్‌లలో ఆ వారం అత్యంత ఆదరణ పొందిన సెలబ్రిటీలతో హాలీవుడ్‌ రిపోర్టర్‌ జాబితా తయారు చేసి విడుదల చేస్తుంది.కాగా ప్రియాంక స్విమ్‌ సూట్‌లో ఉన్న ఫొటోలను ఆమె తన ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రియంక భర్త నిక్‌ జోనస్ ఈ ఫొటోలను తీయగా, దాదాపు 30లక్షలమంది ఈ ఫొటోను లైక్‌ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: