ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేసిన రాజమౌళి ‘బాహుబలి 2’ చైనా భాషలోకి డబ్ చేయబడి విడుదల చేయబడినా అక్కడ చెప్పుకో తగ్గ స్పందన తెచ్చుకోలేకపోయింది. దీనితో చైనాలో కూడ తన హవా చాటాలని ప్రయత్నించిన రాజమౌళికి ఊహించని షాక్ తగిలింది.

వాస్తవానికి ‘బాహుబలి’ చైనా డబ్బింగ్ అమీర్ ఖాన్ ‘దంగల్’ చైనాలో సృష్టించిన రికార్డులను బ్రేక్ చేస్తుంది అని ఎన్నో ఆశలు రాజమౌళి పెట్టుకున్న విషయం తెలిసిందే.  ‘బాహుబలి’ లాంటి భారీ సినిమా చైనా ప్రజలకు నచ్చక పోవడంతో ఆతరువాత ఏ తెలుగు సినిమా చైనా మార్కెట్ వైపు వెళ్ళలేదు. 

ఇలాంటి పరిస్థుతులలో ‘ఓ బేబి’ సినిమాను చైనా భాషలోకి డబ్ చేసి విడుదల చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలలో ఈమూవీ నిర్మాతలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయమై నిర్మాత సురేశ్ బాబు చైనా ఫిలిం మార్కెట్ కు సంబంధించిన కొందరు డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరుపుతున్నట్లు టాక్. చైనా ప్రజలు ఎమోషన్స్ ఎక్కువగా ఉండే ఇండియన్ సినిమాలను ఇండియన్ సినిమాలను బాగా ఆదరిస్తారు అన్న ప్రచారం ఉంది. 

దీనికి తగ్గట్టుగానే అమీర్ ఖాన్ ‘దంగల్’ ‘పికె’ ‘సీక్రెట్ సూపర్ స్టార్’ మూవీలు హిందీ నుండి చైనా భాషలోకి డబ్ చేయబడి అక్కడ ఘన విజయం సాధించాయి. ఇలాంటి పరిస్థుతులలో ఎమోషన్స్ ఎక్కువగా ఉన్న ‘ఓ బేబి’ చైనా ప్రజలకు బాగా నచ్చుతుంది అన్న అంచనాలు ఉన్నాయి. దీనితో ఈమూవీని చైనా భాషలోకి డబ్ చేయడానికి అనుసరించవలసిన పద్ధాతుతులు తీసుకోవలసిన అనుమతులు గురించి సురేశ్ బాబు దృష్టి పెట్టినట్లు టాక్. ఇదే జరిగితే రాజమౌళి చైనాలో చేద్దాం అని అనుకున్న మ్యాజిక్ సమంత చేస్తుంది అనుకోవాలి..    


మరింత సమాచారం తెలుసుకోండి: