సాహో అప్డేట్ల పర్వం మొదలైంది.   సినిమాకు సంబంధించిన ఒక్కో న్యూస్ బయటకు వస్తున్నది.  మొన్న సాంగ్ ను రిలీజ్ చేసి ప్రమోషన్ స్టార్ట్ చేసిన సాహో టీమ్ ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు.  సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న  తరువాత ప్రభాస్ యూనిట్ తో కలిసి ఫోటోలు దిగారు.  ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి.  


ఆ వెంటనే మరో అప్డేట్ ను రిలీజ్ చేశారు.  8 నిమిషాల ఫైట్ సీక్వెల్ కోసం ఏకంగా 70 కోట్లు ఖర్చు చేశారు.  ఈ అప్డేట్ వచ్చిన మరి కాసేపటికి మరో న్యూస్ బయటకు వచ్చింది.  అదేమంటే.. ఈ సినిమా కోసం యూజ్ చేసిన కార్లు.  ఇందులో ఎన్ని కార్లు ఉపయోగించారు అనే విషయం గురించిన న్యూస్ బయటకు వచ్చింది.  


ఈ సినిమా కోసం ఏకంగా 120 కార్లను ఉపయోగించారు.  ప్రత్యేకంగా తయారు చేయించిన ట్రక్ ను కూడా ఇందులో వినియోగించారు హోలీవడ్ యాక్షన్ సినిమాల్లో ఇలా ఇన్ని కార్లను వినియోగించేవారట.  ఇండియన్ సినిమాకు ఇన్ని కార్లు ఉపయోగించడం ఒక రికార్డ్ అని అంటున్నారు.  


దుబాయ్ తీసిన ఛేజింగ్ సీన్ కోసం 56 కార్లు, మరో ఫైట్ సీన్ కోసం 18 కార్లు మిగతా షూట్ లో మిగతా కార్లు వినియోగించారట.  మరి ఈ స్థాయిలో కార్లను ఉపయోగించారంటే.. సినిమా ఏ రేంజ్ లో ఉంది ఉండాలి.  మరి దానికి తగ్గట్టుగా సినిమా ఉంటుందా చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: