ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో   రుపొందుతున్న  ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని  అక్టోబరు 2న  గాంధీ జయంతి సందర్భంగా  విడుదల చెయ్యాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది.  కాగా ఈ చిత్రంలో మిల్క్ బ్యూటీ తమన్నా కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే తమన్నా పాత్ర గురించి తాజాగా  ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ తెలిసింది.  తమన్నా  సైరాలో ఓ రాణిగా  నటిస్తోందట. పైగా తమన్నా పోషిస్తోన్న  పాత్రకు కాస్త నెగిటివ్ టచ్ కూడా ఉంటుందని సమాచారం.  కాగా ఇప్పటికే  తమన్నా  పుట్టినరోజు సందర్భంగా,  సైరా చిత్రబృందం  ఆమె లుక్ ని రివీల్ చేస్తూ... తమన్నా  పోస్టర్ ను విడుదల చేసింది. పోస్టర్ లో  సాంప్రదాయ వస్త్రధారణలో మరియు  అలంకరణలతో ఉన్న  తమన్నా  లుక్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. 

  

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో   సుదీప్, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు వంటి స్టార్ లు నటిస్తున్నారు.  ఇక ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో  హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న  ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో  విడుదల చేయనున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: