భారీ బడ్జెట్ సినిమాలతో చాలా సమస్యలు ఉంటాయి. ఒకసారి రిలీజ్ డేట్ ప్రకటిస్తే ఆ సినిమాకు పోటీగా లేకుండా మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు తమ రిలీజ్ డేట్లు ప్ర‌క‌టిస్తాయి. ఒకసారి భారీ బడ్జెట్ సినిమాను వాయిదా వేస్తే ఆ ప్రభావం చిన్న సినిమాల మీద ఉంటుంది. మీడియం రేంజ్ హీరోలు అయితే తమ సినిమాకు సరైన రిలీజ్ డేట్ లేక తీవ్రమైన ఇబ్బందులు పడతారు. ఆ ఎఫెక్ట్ సినిమా బిజినెస్‌తో పాటు ... రిజ‌ల్ట్‌పై కూడా ఉంటుంది.


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా ఆగస్టు 15 న రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు రాని హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి దిగుతుంది అని అందరూ కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్... డబ్బింగ్ వర్క్ పూర్తి కాకపోవడంతో ఆగస్టు 30 కు వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి. సాహో రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వ‌డంతో ఇప్పుడు అది నానీ గ్యాంగ్‌లీడర్ కు ఎర్త్ పెట్టేసింది.


కేవలం మూడు రోజుల క్రితమే నాని గ్యాంగ్‌లీడర్ సినిమా ఆగస్టు 30న రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్లు కూడా వేశారు. ఇప్పుడు కూడా అదే డేట్ కు వస్తే గ్యాంగ్ లీడర్ తప్పనిసరిగా వాయిదా వేయాల్సిందే. రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న సాహో సినిమాకు నాని పోటీగా వెళితే భారీ రిస్క్ అవుతుంది.
ఏదేమైనా ప్రభాస్ సాహో రిలీజ్ పోస్ట్ పోన్ నాని గ్యాంగ్‌లీడర్ రిలీజ్ కు పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది.


ఒకవేళ గ్యాంగ్‌లీడర్ సెప్టెంబర్ కి వెళితే వెంకీ మామ రిలీజ్‌కు సరికొత్త డేట్ వెతుక్కోవాలి. అదృష్టం అంటే శర్వానంద్.. అడవి శేషుదే. సాహో పోస్ట్‌పోన్‌ అవడంతో ఈ ఇద్దరు హీరోలు త‌మ రణరంగం... ఎవరు సినిమాలను ఆగస్టు 15న థియేటర్లలోకి తెచ్చేస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: