ముద్దు సన్నివేశాల్లో నటించేందుకు మన హీరోయిన్లు ఇప్పుడు పెద్దగా ఇబ్బందులు పడటంలేదు.  కథ డిమాండ్ చేస్తుంది అంటే సరే అంటున్నారు.  అమలా పాల్ ఈ విషయంలో ఓ అడుగు ముందుకు వేసింది.  హాలీవుడ్ సినిమాల్లో లానే న్యూడ్ గా నటించేందుకు సైతం ఒకే చెప్పింది.  


చెప్పడమే కాదు చేసి చూపించింది కూడా.  మాములుగా హీరోయిన్లు న్యూడ్ గా నటించాడని పెద్దగా ఆసక్తి చూపించరు.  అమలా పాల్ మాత్రం దానికి విరుద్ధంగా అలాంటి సీన్స్ లో నటించేందుకు రెడీ అంటోంది.  ఆమె సినిమాలో న్యూడ్ గా నటించి మెప్పించింది.  


ఇందులో అమ్మాయిని ముద్దుపెట్టుకుని సన్నివేశం ఒకటి ఉంది.  దానిపై అమలా పాల్ ను మీడియా ప్రశ్నిస్తే.. ఆమె చెప్పిన సమాధానం వింతగా ఉండటం విశేషం.  ‘ఓ అమ్మాయిని ముద్దుపెట్టుకోవడంలో తప్పేంటి? ఆ షాట్‌ అనుకోకుండా వచ్చింది, అది స్క్రిప్టులో లేదు. ఓసారి పాత్రలో లీనమైతే.. ఇక మన స్వభావాన్ని పక్కన పెట్టినట్లే. ఈ చిత్రం శృంగారం నేపథ్యంలో సాగేది కాదు. ఈ సినిమా కంటెంట్‌ అర్థం చేసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే. నిజానికి ఈ చిత్రం నటిగా నాకు ఇంకాస్త నమ్మకం, బలాన్ని ఇచ్చింది. 

తొలుత ఆ సన్నివేశాల్లో ఎలా నటించాలని ఆలోచించా. కానీ ఓసారి కెమెరా ముందుకు వెళ్లిన తర్వాత.. సౌకర్యంగానే ఉన్నా. ఇప్పుడు నాకు ఈ ప్రపంచంలోని ఎలాంటి సవాలునైనా ఎదుర్కోగలననే నమ్మకం వచ్చింది. ఈ సినిమాకు సంతకం చేయడానికి ముందే నగ్న సన్నివేశాల గురించి మా అమ్మకు చెప్పా. అలాంటి సీన్లు స్క్రిప్టుకు కచ్చితంగా అవసరం అనిపిస్తే నటించమన్నారు అని చెప్పుకొచ్చింది అమలా పాల్.  ఈనెల 19 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.  రిలీజ్ తరువాత ఎన్ని సంచలనాలు సృష్టిస్తోందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: