బాలకృష్ణ తన కెరీర్లో ఎన్నో హిట్ సినిమాలు చేశారు.  అందులో ఒకటి సమరసింహా రెడ్డి.  బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టాలీవుడ్ లో అప్పట్లో రికార్డులు సృష్టించింది.  కథ, కథనాలు అన్ని మాస్ కు నచ్చే విధంగా ఉండటంతో సినిమా సూపర్ హిట్టైంది.  


విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు.  పరుచూరి బ్రదర్స్ డైలాగులు రాశారట.  మొదట ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ సమరసింహం అనే పేరును పెట్టారు.  కథకు అనుగుణంగా పేరు పెట్టినా అది సినిమాకు సరిగ్గా యాప్ట్ కాదని చెప్పి పరుచూరి బ్రదర్స్ ఆ టైటిల్ ను సమరసింహా రెడ్డి గా మార్చారు.  


సింహం అంటే వేటాడుతుంది.  అదే చివర్లో పేరు చేరిస్తే.. మనిషి కాబట్టి క్షమాగుణం ఉంటుంది.  కాబట్టి క్షమించి వదిలేయవచ్చు.  మార్పు తీసుకురావొచ్చు.  అందుకే పేరులో మార్పులు చేశారట.  మొదట్లో విజయేంద్ర ప్రసాద్ టైటిల్ మార్చేందుకు ఒప్పుకోలేదట.  


చివరకు టైటిల్ మారింది.. సినిమా సూపర్ హిట్టైంది.  ఇప్పటికి ఈ సినిమా టీవిలో వేస్తె మంచి రేటింగ్ వస్తుంది.  పైగా ఈ సినిమాకు ఏపీ సీఎం జగన్ మంచి ఫ్యాన్ కూడా.  ఈ సినిమా వంద రోజుల సందర్భంగా పేపర్లో జగన్ ఫోటోను వేసుకున్నట్టుగా ఇటీవలే వార్తలు వచ్చాయి.  ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: