అక్షయ్ మిషన్ మంగళ్ గురించిన అనేక ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి.  మిషన్ మంగళ్ పేరు వింటేనే ఒళ్ళు జాతీయ భావంతో పులకించి పోతుంది.  మన శాస్త్రవేత్తల తెలివి ఎలాంటిదో ప్రపంచానికి చాటి చెప్పిన ప్రయోగం అది.  అతి తక్కువ ఖర్చుతో ఈ ప్రయోగాన్ని చేసింది ఇండియా.  


అప్పట్లో ఈ ఉపగ్రహ ప్రయోగానికి ముందు ప్రపంచ దేశాలు ఇండియాను వింతగా చూశాయి.  తక్కువ ఖర్చుతో మామ్ ను ప్రయోగిస్తున్నారు.  మార్స్ గ్రాహం ఉన్నది పక్కనే కాదు అంటూ విమర్శలు చేశారు.  ఈ విమర్శలను ఇండియా ఉపగ్రహ ప్రయోగంతో తిప్పి కొట్టింది.  


మంగళ్ యాన్ ప్రయోగానికి ఇండియా చేసిన ఖర్చు కేవలం 450 కోట్లు మాత్రమే.  హాలీవుడ్ గ్రావిటీ కంటే తక్కువ ఖర్చుతో ఉపగ్రహం ప్రయోగం చేయడం విశేషం.  ఇప్పుడు అక్షయ్ కుమార్ కూడా ఇదే విధమైన పోలికతో మాట్లాడారు.  మంగళ్యాన్ కు 450 కోట్లు ఖర్చయితే... అక్షయ్ నటించిన 2పాయింట్ 0 సినిమాకు రూ.500 కోట్లు ఖర్చు అయ్యింది.  


సో, ఇండియాలో కూడా కాస్టలీ సినిమాలు నిర్మితమౌతున్నాయి అని చెప్పడానికి ఇదొక నిదర్శనం.  500 కోట్లు అంటే ఇప్పుడు పెద్దగా బడ్జెట్ కాదు అనే ధోరణిలో ఉన్నారు నిర్మాతలు.  ప్రస్తుతం ఇదే రేంజ్ లో సాహో, సైరా, ఆర్ఆర్ఆర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి.  విక్రమ్ మహావీర్ కర్ణ సినిమాకు బడ్జెట్ కూడా భారీగా ఉన్నది.  అటు అల్లు అరవింద్ రామాయణం ఖర్చు 1500 కోట్లు వరకు ఉంటుందని తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: