యంగ్ హీరో నితిన్ కు లైఫ్ ఇచ్చిన దర్శకుడు తేజ. జ‌యం సినిమాతో ఆరంగ్రేటంలోనే తిరుగులేని విజయాన్ని అందించాడు. ఆ సినిమా టైం లోనే నితిన్ తండ్రి సుధాక‌ర్‌రెడ్డితో తేజకు అనుకోకుండా గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఎవ‌రి దారులు వాళ్ల‌వి అయ్యాయి. జ‌యం సినిమా వచ్చిన దశాబ్దానికి మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో ధైర్యం సినిమా వచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అవడంతో ఇద్దరి మధ్య సరైన సత్సంబంధాలు లేవు అన్న ప్రచారం బయట వినిపించింది.


తేజ ఇప్పుడు తాను చేసిన హీరోల‌ గురించి మాట్లాడిన నితిన్ గురించి మాత్రం పెదవి విప్ప‌డు. వీరిద్దరి మధ్య అసలు ఏం జరిగింది ? ఎందుకు మాట్లాడుకోవడం లేదన్న విషయం చాలామందికి అర్థం కాదు. తాను పరిచయం చేసిన వాళ్లలో మంచి స్థాయిని అందుకున్న ఉదయ్ కిరణ్, కాజల్ అగర్వాల్‌ లాంటి వాళ్ల గురించి గొప్ప‌గా మాట్లాడే తేజ నితిన్ ప్ర‌స్తావ‌న తేక‌పోయినా... కృతజ్ఞత లేని వాళ్లంటూ సెటైర్లు వేస్తుంటాడు.


ఈ లిస్టులో గోపీచంద్‌తో పాటు నితిన్ కూడా ఉన్నాడ‌న్న గుస‌గుస‌లు ఉన్నాయి.  తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో తేజ నితిన్ తండ్రితో ఎందుకు తేడా వచ్చిందో చెప్పాడు. ధైర్యం సినిమా రిలీజ్ టైం లో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డికి - తేజ‌కు మధ్య మనస్పర్ధలు వచ్చాయట. జయం సినిమాను పంపిణీ చేసిన  డిస్ట్రిబ్యూటర్ ధైర్యం సినిమాను కూడా కొంటానని ముందుకు వచ్చాడట. అయితే వాస్తవంగా ధైర్యం సినిమా మీద తనకే నమ్మకాలు లేవని తేజ ముందే డిసైడ్ అయ్యాడ‌ట‌.


భార్య పిల్ల‌లు జాగ్ర‌త్త అని ఆ డిస్ట్రిబ్యూట‌ర్‌తో తేజ చెప్ప‌డంతో అత‌డు సినిమా కొన‌లేద‌ట‌. ఆ టైంలో తేజ‌పై సుధాక‌ర్‌రెడ్డి నిర్మాత‌ల మండ‌లిలో ఫిర్యాదు చేయ‌డం... తేజ‌కు ఇచ్చిన రూ.2 కోట్ల రెమ్యున‌రేష‌న్లో కోటి వెన‌క్కు ఇవ్వ‌మ‌ని ఆదేశాలు రావ‌డం.. తేజ కోటి రిట‌ర్న్ ఇవ్వ‌డం జ‌రిగాయ‌ట‌. అప్ప‌టి నుంచి వారిద్ద‌రి మ‌ధ్య గ్యాప్ వ‌చ్చిన‌ట్టే తేజ మాట‌ల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: