ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరక్టర్ అజయ్ భూపతి తన రెండవ ప్రయత్నంగా ఓ క్రేజీ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. మాస్ మహరాజ్ రవితేజ హీరోగా అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్న సినిమా మహా సముద్రం. జెమిని కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజతో పాటుగా మరో హీరో కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది.


రవితేజతో పాటుగా ఈ సినిమాలో క్లాస్ హీరో సిద్ధార్థ్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. సో అనుకున్నట్టుగా మహా సముద్రం సింగిల్ హీరో సినిమా కాదన్నమాట. ఈ సినిమాను మల్టీస్టారర్ గా తెరకెక్కిస్తున్నాడు అజయ్ భూపతి. ఆరెక్స్ 100తో తన డైరక్షన్ టాలెంట్ చూపించిన అజయ్ భూపతి రెండో సినిమానే క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేశాడు.


క్రైం థ్రిల్లర్ కథతో వస్తున్న ఈ మహా సముద్రం సినిమాలో రవితేజ సరసన అదితి రావు హైదరి సెలెక్ట్ అయ్యింది. అయితే ఈ సినిమాలో సిద్ధార్థ్ పాత్ర ఎలా ఉంటుంది. ఒకవేళ సినిమాలో సిద్ధు విలన్ గా నటిస్తున్నాడా అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. తప్పకుండా ఈ సినిమా మరో క్రేజీ మల్టీస్టారర్ అవుతుందని చెప్పొచ్చు.


ఇప్పటికే ఆరెక్స్ 100 సినిమాలో నటించిన పాయల్ వరుస అవకాశాలు కొట్టేస్తుండగా హీరో కార్తికేయ కూడా వరుస ఛాన్సులు అందుకుంటున్నాడు. డైరక్టర్ గా తను సక్సెస్ అవడమే కాకుండా కొత్తవాళ్లైనా కాస్టింగ్ కు మంచి కెరియర్ ఇచ్చాడు అజయ్ మరి రవితేజ, సిద్ధార్థ మహాసముద్రం ఎలా ఉంటుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: