'బాహుబలి' తర్వాత భారీ బడ్జెట్ తో ప్రభాస్ కెరీర్ లో తెరకెక్కుతున్న సినిమా సాహో. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించారు. నాలుగు ప్రధాన భాష గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 15వ తారీఖున విడుదల అవుతుందని గతంలో తెలియజేశారు సినిమాకి సంబంధించిన వారు. అదే విషయాన్ని విడుదలైన టీజర్ లోనూ మరియు పోస్టర్ లోనూ రివీల్ చేశారు.


దీంతో ప్రభాస్ అభిమానులు బాహుబలి తర్వాత సాహో సినిమా ఆగస్టు 15న వస్తుందని..ఎంతగానో ఎదురు చూసిన క్రమంలో సడన్ గా సినిమా ఆగస్టు 30న వస్తుందని..తెలపడంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. చాలామంది ప్రభాస్ అభిమానులు సినిమా నిర్మాతల పై దర్శకుడిపై సోషల్ మీడియా లో బండ బూతులు కూడా తిట్టారు. అయితే సినిమా ఎందుకు ఆలస్యం అవుతుంది అన్న దాని విషయంపై తాజాగా సినిమా యూనిట్ కి చెందినవారు క్లారిటీ ఇవ్వడం జరిగింది.


సాహో సినిమా లో “భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మరియు ఇదివరకు ఎన్నడూ ఇండియన్ స్క్రీన్ పై తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే.కానీ ఇప్పటి వరకు వచ్చిన అవుట్ ఫుట్ సాహో యూనిట్ కు అంతగా నచ్చలేదు. ఎక్కువగా యాక్షన్ టాకీ ఉండడం వల్ల అధిక నాణ్యతతో సినిమాను ప్రేక్షకుల ముందు ఉంచడానికే సినిమాను వాయిదా వేసాం,ఈ చిత్రాన్ని ఏకకాలంలో తెలుగు,తమిళ్ మరియు హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నామని ఈ అప్డేట్ ద్వారా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్న అభిమానులు కాస్త కుదుట పడతారని భావిస్తున్నామని” తెలియజేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: