వివాదాస్పద సంచలన దర్శకుడిగా పేరుగాంచిన రామ్ గోపాల్ వర్మ గారు ఏది చేసినా అది పెద్ద సంచలనం అనే చెప్పాలి. ఇటీవల కొద్దిరోజులుగా టిడిపి పై అలానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తనదైన శైలిలో తన  సోషల్ మీడియా ఖాతాల్లో సెటైర్లు వేస్తూ వస్తున్న వర్మ, రెండు రోజుల నుండి మంచి హ్యాపీ మూడ్ లో కనపడుతున్నారు. 

దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూపులు చూస్తున్న అయన ప్రియ శిష్యుడు పూరి జగన్నాథ్ కు ఇటీవల విడుదలైన ఇస్మార్ట్ శంకర్ రూపంలో మంచి హిట్ దొరకడమే. ఇక తన శిష్యుడి హిట్ ని అతనితోపాటు ఎంజాయ్ చేస్తున్న వర్మ, నేడు ఇస్మార్ట్ శంకర్ సినిమా టీమ్ ఏర్పాటు చేసిన సక్సెస్ పార్టీలో విపరీతంగా సందడి చేసారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాను అద్భుతం అంటూ పొగిడిన వర్మ, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ సినిమాకు సీక్వెల్ ని ప్రారంభించాలని పూరీని కోరుతూ సోషల్ మీడియాలో నిన్న ఒక పోస్ట్ చేసారు. 

ఇక ఇవాళ జరిగిన ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ పార్టీలో మందు బాటిల్ పట్టుకుని వర్మ తనపై అలానే దర్శకుడు పూరి, నిర్మాత ఛార్మి, హీరోయిన్ నిధి అగర్వాల్ పై ఒలకబోస్తూ విపరీతంగా సందడి చేసారు. ఇక వర్మ చేసిన ఆ హడావుడికి ఇస్మార్ట్ శంకర్ టీమ్ మొత్తం ఎంతో ఎంజాయ్ చేసింది. ఇక తాను మందు బాటిల్ తో సందడి చేసిన వీడియోలను వర్మ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: