‘సాహో’ విడుదల వాయిదా పడటం ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ ‘సైరా’ సినిమాల బయ్యర్లకు భయాన్ని కలిగిస్తోంది అని అంటున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ షూటింగ్ కు మొదటి నుండి సమస్యలు ఎదురౌతూనే ఉన్నాయి. 

దీనికితోడు ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్స్ సమస్య ఇప్పటికీ అదే విధంగా కొనసాగుతోంది అన్న సంకేతాలు వాస్తున్నాయి. రాజమౌళి ఈసినిమా మేకింగ్ కు సంబంధించి అత్యంత రహస్యాలు కొనసాగిస్తున్నా ఈమూవీ మేకింగ్ విషయంలో  లీక్ అవుతున్న నెగిటివ్ వార్తలు కొనసాగుతూనే ఉన్నాయి. 

వాస్తవానికి ఈసినిమా విడుదల వచ్చే ఏడాది జూలైలో అయినప్పటికీ ఇప్పటి నుంచే ఈమూవీ కొనడానికి అనేకమంది బయ్యర్లు ఈమూవీ నిర్మాత దానాయ్యతో రాయబారాలో నడిపారు. అయితే రాజమౌళి ఈసినిమా బిజినెస్ ను ఇంత ముందుగా ఓపెన్ చేయవద్దని దానయ్యతో చెప్పడంతో భారీ  అడ్వాన్సుల ఆఫేర్లు వచ్చినా తీసుకోలేదని టాక్. 

అయితే ఇప్పడు ‘సాహో’ విడుదల వాయిదా పడటంతో పాటు ఆమూవీ అవుట్ పుట్ గురించి అనేక వార్తలు వస్తున్న పరిస్థితులలో ‘సాహో’ ఫలితం తెలిసిన తరువాత మాత్రమే ‘ఆర్ ఆర్ ఆర్’ రైట్స్ గురించి మళ్ళీ ప్రయత్నాలు చేద్దాము అన్న ఉద్దేశ్యంతో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అనేకమంది బయ్యర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ అనుకున్న విధంగా జరగక పోతున్న పరిస్థితులలో ఈమూవీ అనుకున్న సమయానికి రాలేదని ‘సాహో’ లాగే అనేకసార్లు వాయిదా పడే ఆస్కారం ఉందని అంటూ కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో ‘సాహో’ రిజల్ట్ ఒక్క ప్రభాస్ కు మాత్రమే సంబంధించింది కాకుండా ‘సైరా’ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాల మార్కెట్ ను శాసించే అంశంగా మారిందని అంటున్నారు..    



మరింత సమాచారం తెలుసుకోండి: