మ‌రి రాదా.. ఇప్పుడు ఈమెకు ఉన్న క్రేజ్.. వ‌స్తున్న విజ‌యాలు.. చేస్తున్న సినిమాలు.. ఎంచుకుంటున్న క‌థ‌లు చూసిన త‌ర్వాత ఏ హీరోయిన్ అయినా ఒళ్లు మండిపోవాల్సిందే.. క‌ళ్లు బ‌య‌ట‌ప‌డాల్సిందే. కాక‌పోతే పైకి న‌వ్వుతూ క‌నిపిస్తున్నారు కానీ లోప‌ల మాత్రం స‌మంత చేస్తున్న సినిమాలు చూసి.. ఆమె సినిమాల‌కు వ‌స్తున్న క‌లెక్ష‌న్లు లెక్క‌లేసి ఏడుస్తున్నారు. పెళ్లి త‌ర్వాత అస‌లు కెరీర్ కొన‌సాగించ‌డ‌మే క‌ష్టం అనుకుంటే స‌మంత ఏకంగా స్టార్ హీరోయిన్‌గానే త‌న ఇమేజ్ కంటిన్యూ చేస్తుంది. 


పైగా స్టార్ హీరోలు కూడా ఈమెతో సినిమాలు చేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తుంది స‌మంత‌. ఈ క్ర‌మంలోనే చేసిన యూ టర్న్ ఫ్లాప్ అయినా ఇప్పుడు చేసిన ఓ బేబీ మంచి విజ‌యం సాధించింది. దాంతో మ‌రిన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయ‌డానికి ఆసక్తి చూపిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. దానికితోడు త‌న భ‌ర్త‌తో క‌లిసి న‌టించిన మజిలీ కూడా బ్లాక్ బ‌స్టర్ అయింది. 


ఇది వ‌చ్చిన మూడు నెల‌ల్లోనే మ‌రో హిట్ ఖాతాలో వేసుకుంది స్యామ్. ఇప్పుడు ఓ బేబీ కూడా మంచి వసూళ్లు సాధించడంతో సమంత మార్కెట్ మరింత పెరిగిపోయింది. ఈ వారం ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ కావడంతో ఓ బేబీ కాస్త జోరు తగ్గించింది. మొత్తానికి స‌మంత ఇప్ప‌టికీ దూసుకుపోతున్న తీరు అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.. హీరోయిన్ల‌కు ఏడుపు తెప్పిస్తుంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: