స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా  మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో  సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని  అక్టోబరు 2న  గాంధీ జయంతి సందర్భంగా  విడుదల చేయనున్నారు.  కాగా ఈ చిత్రంలో మిల్క్ బ్యూటీ తమన్నా కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే తమన్నా పాత్ర గురించి తాజాగా  ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ తెలిసింది.  తమన్నా  సైరాలో  నృత్యకారణిగా నటిస్తోందట. పైగా తమన్నా పోషిస్తోన్న  పాత్రకు కాస్త నెగిటివ్ టచ్ కూడా ఉంటుందని సమాచారం.  కాగా ఇప్పటికే  తమన్నా  పుట్టినరోజు సందర్భంగా,  సైరా చిత్రబృందం  ఆమె లుక్ ని రివీల్ చేస్తూ... తమన్నా  పోస్టర్ ను విడుదల చేసింది. పోస్టర్ లో  సాంప్రదాయ వస్త్రధారణలో మరియు  అలంకరణలతో నృత్యకారిణిగా  ఉన్న  తమన్నా  లుక్ నెటిజన్లను బాగానే ఆకట్టుకుంది.  మరి సినిమాలో తమన్నా తన డ్యాన్స్ తో నృత్యకారణిగా మెప్పిస్తోందా అనేది చూడాలి. సహజంగా మంచి డాన్సర్ అయినా తమన్నా ఈ రోల్ చాలా ఈజీగా నటించిందని తెలుస్తోంది.      


ఇక ఈ చిత్రం ట్రైలర్ కోసం అభిమానాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  కాగా తాజాగా ఈ సినిమా నుండి ఆగష్టు 15న ట్రైలర్ తో పాటు  స్పెషల్ పోస్టర్ ను  కూడా రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తోన్నారు.   అమితాబ్ బచ్చన్ మరియు చిరంజీవిల కాంబినేషన్ లో ఈ స్పెషల్ పోస్టర్ విడుదల కానుంది.  కాగా  సైరా టీమ్ భారీ ఎత్తున  గొప్ప ప్రచార ప్రణాళికలను కూడా రూపొందిస్తున్నారట.   ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది ఈ చిత్రం.  ఈ సినిమాలో  సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క  వంటి స్టార్ లు కూడా  నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా  సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో  హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న  ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో  విడుదల చేయనున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: