66​వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈ ఏడాది పురస్కారాలను ఆలస్యంగా ప్రకటించారు. ఈ అవార్డుల్లో సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన ‘మహానటి’ సినిమా​కు జాతీయ పురస్కారం లభించింది. ఈ సినిమాలో ప్రధానపాత్ర పోషించిన కీర్తి సురేశ్‌ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు.

ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు సైతం సత్తా చాటుతున్నాయి. బాహబలి లాంటి ప్రతిష్టాత్మక సినిమాలు టాలీవుడ్ రేంజ్ ఎంతగా పెంచాయో అందరికీ తెలిసిందే.  నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమా తెలగులో సినీ నటులపై వచ్చిన మొదటి బయోపిక్. ఈ మూవీలో అలనాటి అందాల తార సావిత్రి జీవితాన్ని ఆవిష్కరించారు. 


ఇక ఉత్తమ తెలుగు సినిమాగా ‘మహానటి’ ఎంపికైంది.  ఉతమ నటుడు అవార్డును ఆయుష్మాన్‌ ఖురానా, నిక్కీ కౌశల్‌లకు సంయుక్తంగా ప్రకటించారు. ఇక ఈ సారి తెలుగు సినిమాల‌కు సాంకేతిక విభాగంలో ఎక్కువ అవార్డులు వ‌చ్చాయి. హిందీలో ఉత్తమ చిత్రంగా అంధాధున్‌ ఎంపికైంది.  వివిధ విభాగాల్లో ఉత్త‌మ అవార్డులు అందుకున్న వారి జాబితా ఇలా ఉంది. ఇక బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు అవార్డులు రావడం చూస్తూనే ఉన్నాం.


జాతీయ పురస్కారాలు :
ఉత్తమ నటుడు: ఆయుష్మాన్‌ ఖురానా (అంధాధున్‌)
ఉత్తమ నటి: కీర్త సురేశ్‌ (మహానటి)
ఉత్తమ దర్శకుడు: ఆదిత్య దర్‌(ఉడి)
బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: మహానటి
ఉత్తమ యాక్షన్ సినిమా‌: కేజీఎఫ్‌
బెస్ట్‌ మేకప్‌, విజువల్‌, స్పెషల్‌ ఎఫెక్ట్‌: అ!
ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే: చి.ల.సౌ
ఉత్తమ ఆడియోగ్రఫీ: రంగస్థలం
ఉత్తమ సినిమాటోగ్రఫీ: పద్మావత్‌
ఉత్తమ ఉర్దూ చిత్రం: హమీద్‌
ఫిల్మ్‌ ఫ్రెండ్లీ స్టేట్‌: ఉత్తరాఖండ్‌
ఉత్తమ తమిళ చిత్రం: బారమ్‌
ప్రజాదరణ పొందిన సినిమా: బదాయిహో (హిందీ)
ఉత్తమ సహాయనటి: సురేఖ సిక్రీ(బదాయిహో)
ఉత్తమ గాయకుడు: అరిజిత్‌ సింగ్‌(పద్మావత్‌)
ఉత్తమ గాయని: బిందు మాలిని (నాతిచరామి)
ఉత్తమ బాల నటులు: పీవీ రోహిత్‌ (కన్నడ), సందీప్‌ సింగ్‌(పంజాబీ), తల్హా అర్‌షాద్‌(ఉర్దూ), శ్రీనివాస్‌ పొకాలే(మరాఠి)


మరింత సమాచారం తెలుసుకోండి: