రోజురోజుకి  రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం 'సాహో. కాగా  ఈ సినిమాలో  శ్రద్ధా కపూర్ తో పాటు నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రోఫ్, మందిరా బేడి నెగిటివ్ పాత్రలను  పోషిస్తున్నారు, అయితే హిందీ నటుడు  చుంకీ పాండే కూడా ఈ సినిమాలో ఆశ్చర్యం కలిగించే ఓ పాత్రలో కనిపించబోతున్నాడట.  యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్  ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో  అత్యంత భారీ బడ్జెట్ తో  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే  యూఎస్ లో ఇప్పటివరకూ  ఏ సినిమా కలెక్ట్ చెయ్యని కలెక్షన్స్ ను  ప్రభాస్ బాహబలి సిరీస్ అక్కడ మిలియన్స్ లో కలెక్ట్ చేశాయి.  పైగా  ఏ స్టార్ సినిమాకైనా యూఎస్ లో ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోస్ వేస్తారు. ఆ రకంగా సినిమాకి భారీ ఓపెనింగ్స్ వస్తాయి. అప్పుడే కోట్లు పెట్టి కొనుకున్న  డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ పొజిషన్ లోకి వెళ్ళేది. కానీ కొన్ని కారణాల వల్ల సాహో యూఎస్ ప్రీమియర్  షోస్ ను క్యాన్సల్ చేశారట మేకర్స్. కలెక్షన్స్ ఎక్కువుగా వచ్చే ప్రీమియర్ లను రద్దు చేయడంతో అసలుకే మోసం వచ్చేలా ఉందని   యూఎస్  డిస్ట్రిబ్యూటర్లు   కంగారు పడుతున్నారు.   అయితే సినీ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం  సాహో పై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయని,  పైగా యూఎస్‌లో ప్రభాస్ కి మంచి ఫాలోయింగ్ ఉందని డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన అమౌంట్ కంటే  ఎక్కువే వస్తోందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. 


కానీ  వాస్తవ పరిస్థుతుల మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉండేలా కనిపిస్తున్నాయి.  ఎందుకంటే యూఎస్‌లో అత్యంత  భారీ ఫాలోయింగ్ ఉన్న మరో స్టార్  సూపర్ స్టార్ మహేష్‌బాబు.  మహేష్ ఆరు సినిమాలు అక్కడ 1 మిలియన్‌కి పైనే కలెక్ట్ చేశాయి. అందులో మూడు ఫ్లాప్ సినిమాలు ఉండడం గమనార్హం.  అలాంటిది.. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ హీరోగా వచ్చిన 'స్పైడర్' మూవీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టలేక బాక్సాఫీస్ వద్ద చతికలు పడింది.  చివరికీ 'స్పైడర్'  డిస్ట్రిబ్యూటర్స్ కి  నష్టాలే మిగిలాయి.  'సాహో'కి లాగే  'స్పైడర్'కి కూడా  అత్యంత భారీ అంచనాలే  ఉన్నాయి. అన్నిటికి మించి మహేష్ కి యూఎస్ లో ఏ హీరోకి లేని క్రేజ్ ఉంది. అయినా మహేష్  'స్పైడర్' కమర్షియల్ సక్సెస్ ను సాధించలేకపోయింది, కేవలం  సినిమా రిపోర్ట్  కాస్త తేడాగా రావడం వల్ల. ఆ లెక్కన 'సాహో' రిపోర్ట్ కూడా కాస్త తేడాగా వచ్చిందా.. ఇక 'సాహో' పరిస్థితి  కూడా    'స్పైడర్'కి కంటే మెరుగ్గా ఉండకపోవచ్చు. మొత్తానికి  మహేష్ బాబుకి లాగే ప్రభాస్ కి కూడా జరిగేలా ఉంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: