హీరోయిన్లలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. కొందరు అందంతో ఆకట్టుకుంటారు. మరికొందరు అభినయంతో అలరిస్తారు.. మరికొందరు అందాల ప్రదర్శనతో కిక్కెక్కిస్తారు. ఎవరికి ఏది సూటవుతుందో …ఆ రూట్ లో వెళ్లడం ద్వారా సక్సస్ అవుతుంటారు. ఇక్కడ ఎవరినీ తప్పుబట్టలేం.. ఫైనల్ గా సినిమా ఇండస్ట్రీలో అందరికీ కావాల్సింది సక్సస్ మాత్రమే.


సక్సస్ ఉంటేనే ఎవరైనా ఇక్కడ కింగ్..అయితే గ్లామర్ ఉంటే సినిమాలు సక్సస్ అవుతాయన్నమాట వాస్తవమే.. అందులో తప్పేమీ లేదు.. కానీ కేవలం గ్లామర్, అందాల ప్రదర్శనలను నమ్ముకుని సినిమాలు ఆడే అవకాశాలు చాలా తక్కువ. అయితే ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించిన పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు అందాల ప్రద్శనకు పెద్దపీట వేస్తోంది.


అవకాశాల కోసం బోల్డ్ సీన్లుకు ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. దర్శకుడు కూడా అలాంటివే ఆమెకు సూట్ అవుతాయని అంటున్నారు. తాజాగా ఆమె నటిస్తున్న ఆర్ డీఎక్స్ లవ్ సినిమాలోనూ హాట్ హాట్ అందాల ఆరబోతకే ప్రాధాన్యం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ సినిమా టైటిల్.. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తే.. పాయర్ రాజ్ పుత్ అందాల ప్రదర్శకు ఈ సినిమా మరో వేదిక కాబోతోందని అర్థమవుతోంది.


సాధారణంగా సినిమాల పోస్టర్లలో హీరోలకు ప్రాధాన్యం ఉంటుంది. కానీ ఈ ఆర్డీఎక్స్ లవ్ సినిమా విషయంలో పాయల్ రాజ్ పుత్ నే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. తేజు కంచెర్ల హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. మొదటి సినిమా ఆర్‌ ఎక్స్ 100 సినిమాలోనూ పాయల్ బోల్డ్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరొకటి కూడా అలాంటి చిత్రంలోనే నటించడం ద్వారా.. ఆమె ఇలాంటి సినిమాలకే పరిమితం అవుతుందా అన్న అనుమానాలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: