టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మరియు బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ ల కలయికలో రూపొందుతున్న సాహో సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో క్రేజ్ తారా స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. మొదటిగా విడుదలైన టీజర్ మరియు సాంగ్స్ తో ఆకట్టుకున్న సాహో, ఆ తరువాత ఇటీవల ట్రైలర్ రిలీజ్ తరువాత ఆ అంచనాలు అమాంతం పెంచేసింది. యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ త్రిల్లర్ లో ప్రభాస్ ఒక అండర్ కవర్ కాప్ గా నటిస్తున్నట్లు సమాచారం. 

టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన యువి క్రియేషన్స్ సంస్థపై నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి, చివరకు ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతోంది. అయితే ఈ సినిమా విడుదలను భారీ స్థాయిలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు, మరియు ఇతర భాషలు, అలానే ఇతర దేశాలు, ఇలా మొత్తం కలిపి దాదాపుగా పదివేల థియేటర్లలో సాహో రిలీజ్ కానున్నట్లు ఒక వార్త నేడు పలు సినిమా వర్గాల్లో విపరీతంగా ప్రచారం అవుతోంది. 

నిజానికి ఈ సినిమా రిలీజ్ సమయానికి విడుదల చేయాలని భావించిన పలు సినిమాలు కూడా పోటీ నుండి తప్పుకోవడంతో, ఆ టైములో కేవలం సాహో ఒక్కటే విడుదల కానుండడంతో వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేయాలనేది నిర్మాతల ప్లాన్ అట. ఇంత భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్లు నేడు ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక ఒకవేళ నిజమే అయితే మాత్రం, సాహో కు ఓపెనింగ్స్ రూపంలోనే చాలావరకు పెట్టుబడి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు సినిమా విశ్లేషకులు. మరి ఈ వార్తలో నిజానిజాలు తెలియాలంటే సాహో నిర్మాతల నుండి ఒక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: