కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం మన్మథుడు 2 కు విడుదలైన రోజు నుండి విపరీతమైన నెగిటివ్ టాక్  వచ్చింది. అయితే ఆ టాక్ ను తట్టుకొని మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా  5కోట్ల షేర్ ను రాబట్టి  పర్వాలేదనిపించింది.  అయితే  శనివారం , ఆదివారం మాత్రం ఈ చిత్రం అన్ని చోట్ల తేలిపోయింది. ఈసినిమా కంటే కొన్ని థియేటర్లలో సంపూర్ణేష్ బాబు నటించిన కొబ్బరిమట్ట ఎక్కువ  గ్రాస్ ను కలెక్ట్ చేసింది. దాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు  బాక్సాఫిస్ వద్ద మన్మథుడు 2   పరిస్థితి ఎలా ఉందోనని..  కాగా మూడు రోజుల్లో ఈ చిత్రం  8కోట్ల షేర్ రాబట్టి డిజాస్టర్ దిశగా  పయనిస్తుంది.  

ప్రపంచ వ్యాప్తంగా  18కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం ఫుల్ రన్ లో 10కోట్ల వరకు వసూళ్లను రాబట్టే అవకాశాలు వున్నాయి. దాంతో  బయ్యర్లకు భారీ నష్టాలు తప్పేలా లేవు.  రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించగా  ఆర్ ఎక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు.  ఫ్రెంచ్ మూవీ 'ఐ డు' కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాగార్జున తో కలసి జెమిని కిరణ్  నిర్మించాడు. కాగా  గత  ఏడాది  ఆఫీసర్ , దేవదాస్ సినిమాలతో  పరాజయాలను చవి చూసిన నాగ్ తాజాగా ఈ మన్మథుడు 2 తో హ్యాట్రిక్ పరాజయాలను ఖాతాలో వేసుకున్నాడు.  ఇక ఈసినిమా తరువాత నాగ్ , కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సూపర్ హిట్ మూవీ  సోగ్గాడే చిన్ననాయన కు సీక్వెల్ గా తెరకెక్కనున్న చిత్రంలో నటించనున్నాడు. ఈసినిమాకు బంగార్రాజు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: