రాజమౌళి తెరకెక్కించిన అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు బాహుబలి బిగినింగ్..బాహుబలి కన్‌క్లూజన్ తర్వాత మళ్ళీ అలాంటి భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమాలు మెగాస్టార్ సైరా, ప్రభాస్ సాహో. ఈ రెండు సినిమాలను దాదాపు అన్నీ భాషల్లో రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సనాహాలు చేస్తున్నారు. అయితే రీసెంట్‌గా సాహో టీమ్ థియోట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసి భారీగా తెలుగు, తమిళ్, హిందీలో అంచనాలను పెంచేశారు. ఇప్పుడు అదే విధంగా సైరా కూడా ప్లాన్ చేస్తున్నారని లేటెస్ట్ సమాచారం. సాహో కి ఏమాత్రం తగ్గకుండా మెగా అభిమానులు పండగ చేసుకునేలా సైరా బృందం ప్లాన్ చేయబోతున్నారట.  

తెలుగు, తమిళ, కన్నడ..ఇలా ఒక భాషలో తెరకెక్కిన సినిమా ఇండియా వైడ్ విడుదల కావాలి అనుకున్నపుడు పబ్లిసిటీ ప్లానింగ్ కూడా అలాగే భారీగా వుంటుంది. పైగా అంత భారీ సినిమా అంటే ఆ హీరోకు ఆయా భాషలో మార్కెట్ రేంజ్ కూడా అలాగే వుంటుంది. అందువల్ల పబ్లిసిటీ చేసినా, చేయకున్నా, సినిమా మీద క్రేజ్ ఆటోమెటిక్ గా వచ్చేస్తుంది. కానీ నేషనల్ వైడ్ గా క్రేజ్ రావలంటే మాత్రం ముందు బాలీవుడ్ వైపు నుంచి పబ్లిసిటి స్టార్ట్ చేసుంటు రావాలి. అందుకే సాహో సినిమాకు ఫస్ట్ ఫంక్షన్ బాలీవుడ్ లో చేసారు.ఇక  తెలుగులో వస్తున్న మరో భారీ సినిమా సైరా. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే విధంగా ముందుకు వెళ్తోంది. 

అక్టోబర్ 2న సైరా విడుదల అని చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈనెల 14 నుంచి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ముందుగా 14న సైరా మేకింగ్ వీడియో విడుదల చేస్తారు. ఆ తరువాత ఈనెల 20న ముంబాయ్ లో భారీ ఫంక్షన్ చేయబోతున్నారు. అమితాబ్, విజయ్ సేతుపతి, మెగాస్టార్ చిరంజీవి తదితరులంతా ఈ ఈవెంట్ లో పాల్గొంటారు. అదే ఈవెంట్ లో సైరా టీజర్ విడదుల చేస్తారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, తమన్నా భాటియా, సుదీప్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తుండగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతమందిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: