2019 సెకండాఫ్లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా సాహో. దాదాపు 350 కోట్ల రుపాయల భారీ బడ్జెట్ తో సాహో సినిమాను నిర్మిస్తున్నారు నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సాహో సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. మొదటి రోజు ఈ సినిమా రికార్డ్ స్థాయి వసూళ్ళు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాహో సినిమా సీడెడ్ హక్కులు 25 కోట్ల రుపాయలకు అమ్మినట్లు సమాచారం. 
 
ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ 60 కోట్ల రుపాయల భారీ మొత్తానికి సన్ నెట్ వర్క్ కొనుగోలు చేసినట్లు సమాచారం. తెలుగు, తమిళం, మలయాళ భాషల శాటిలైట్, డిజిటల్ హక్కుల కొరకు ఇంత భారీ మొత్తాన్ని చెల్లించినట్లు తెలుస్తుంది. హిందీ శాటిలైట్, డిజిటల్ వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. హిందీ శాటిలైట్, డిజిటల్ రైట్స్ 40 కోట్ల రుపాయలకు అమ్మినా కేవలం శాటిలైట్, డిజిటల్ రైట్స్ తోనే సాహో నిర్మాతలకు 100 కోట్ల రుపాయలు వచ్చే అవకాశం ఉంది. 
 
సాహో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 18వ తేదీన రామోజి ఫిలిం సిటీలో జరగబోతుందని తెలుస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కోటిన్నర రుపాయలు నిర్మాతలు ఖర్చు పెడుతున్నారని తెలుస్తోంది. ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం సాహో సినిమా డిస్ట్రిబ్యూటర్లకు అనుకోని సమస్య వచ్చినట్లు సమాచారం. సాహో సినిమాపై భారీగా అంచనాలు ఉండటంతో భారీ మొత్తంలో డబ్బు చెల్లించి సాహో రైట్స్ కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. సాహో సినిమాకు భారీగా ప్రీమియర్ షోలు వేసి ప్రీమియర్ షోల ద్వారా కలెక్షన్లు సాధించాలని అంచనా వేసారట డిస్ట్రిబ్యూటర్లు. కానీ సాహో మేకర్స్ మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు ప్రీమియర్ షోలు వద్దని చెప్పారని తెలుస్తోంది. ఆగష్ట్ 30వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పది వేల థియేటర్లలో విడుదల కాబోతుందని సమాచారం. 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: