రామ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో జులై 18వ తేదీన విడుదలైంది ఇస్మార్ట్ శంకర్. క్రిటిక్స్ నుండి యావరేజ్ రివ్యూలే వచ్చినప్పటికీ, చాలా రోజుల నుండి ఊర మాస్ సినిమా రాకపోవటం, రామ్ నటన అద్భుతంగా ఉండటం, హీరోయిన్లైన నభా నటేష్, నిధి అగర్వాల్ గ్లామర్ సినిమాను సూపర్ హిట్ చేసాయి. 16 కోట్ల రుపాయల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఇస్మార్ట్ శంకర్ మొదటి వారంలోనే 32 కోట్ల రుపాయల షేర్ వసూలు చేసింది. 
 
ఇస్మార్ట్ శంకర్ విడుదలైన వారం రోజుల తరువాత డియర్ కామ్రేడ్ సినిమా విడుదలైంది. డియర్ కామ్రేడ్ సినిమాకు ఫ్లాప్ టాక్ రావటంతో రెండో వారంలో కూడా పరవాలేదనిపించే విధంగా కలెక్షన్లు సాధించింది ఇస్మార్ట్ శంకర్. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు 25 రోజుల్లో 40 కోట్ల రుపాయల షేర్, 80 కోట్ల రుపాయల గ్రాస్ వసూళ్ళు వచ్చాయి. రామ్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్లు సాధించింది ఇస్మార్ట్ శంకర్ సినిమా. 
 
25 రోజుల్లో ఇస్మార్ట్ శంకర్ నైజాం ఏరియాలో 16 కోట్లు వసూలు చేసింది. సీడెడ్ ఏరియాలో 6 కోట్ల రుపాయల షేర్ వసూళ్ళు రాబట్టింది. వైజాగ్ ఏరియాలో నాలుగున్నర కోట్లు, ఉభయ గోదావరి జిల్లాలో 4 కోట్లు, కృష్ణా జిల్లాలో 2 కోట్లు, గుంటూర్ జిల్లాలో 2 కోట్లు నెల్లూర్ జిల్లాలో కోటీ 20 లక్షల షేర్ వసూళ్ళు సాధించింది ఇస్మార్ట్ శంకర్ సినిమా. కర్ణాటకలో 2 కోట్లు, ఓవర్సీస్లో కోటి రుపాయలు ఇస్మార్ట్ శంకర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. 
 
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ కొట్టిన పూరీ తన తరువాత సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తాడని ప్రకటించాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. 2020 జనవరి నుండి పూరీ విజయ్ కాంబినేషన్లో సినిమా మొదలు కాబొతుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నత్తితో మాట్లాడే పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: