నిబంధనలు పాటిస్తేనే ఎవరైనా తమ గౌరవం కాపాడుకునేది. లేకపోతే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు. అది ఫైన్ కావొచ్చు, సీజ్ చేయటం కావొచ్చు.. మరీ పెద్ద విషయమైతే జైలు శిక్ష వరకూ వెళ్లొచ్చు. ప్రస్తుతం ఓ టాలీవుడ్ యంగ్ హీరోకు ఇదే అనుభవం ఎదురైంది. నిబంధనలు పాటించకుండా కారు నడుపుతున్న హీరో నాగ శౌర్యకు పోలీసులు షాకిచ్చారు. హైదరాబాద్ లో జరిగిన ఈ సంఘటన వివరాలు..

 

 

 

హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో బ్లాక్ ఫిల్మ్ తో వెళ్తున్న ఓ కారును గుర్తించి పోలీసులు ఆపారు. చూస్తే కారులో ఉన్నది టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య. సెలెబ్రిటీ అయినా కూడా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.. సెలబ్రిటీలపట్ల కూడా పోలీసులు అదేవిధంగా వ్యహరించాలి. బంజారా హిల్స్ పోలీసులు అదే చేశారు. నిబంధనలకు విరుద్ధంగా  కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉంచినందుకు బంజారా హిల్స్ పోలీసులు నాగ శౌర్యకు రూ.500/- ఫైన్ వేశారు. అక్కడితో ఆగకుండా కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను పోలీసులు తొలగించారు. దీంతో పోలీసులు విధించిన ఫైన్ ను కట్టేసి నాగ శౌర్య అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఈ వార్త హల్ చల్ చేస్తోంది.

 

 

 

కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ అంటించకూడదని పోలీసులు ఎంతగా చెప్తున్నా, ప్రకటనలు ఇస్తున్నా కొందరు నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్నారు. పలువురు ప్రముఖులు, సినిమా సెలబ్రిటీలు ఈ విధంగా వ్యవహరిస్తూ చేయడం సరికాదు. ఇటువంటి సంఘటనలు హైదరాబాద్ లో ఎక్కువగా జరుగుతున్నాయి.  సామాన్యులతోపాటు సినిమా వాళ్లపై కూడా ఫైన్ లు వేస్తున్న పోలీసులను అభినందించాల్సిందే. అలాగే.. నిబంధనలు పాటించని  కొందరు రాజకీయ నాయకుల అనుచరులపై కూడా పోలీసులు గుర్తించి చర్యలు తీసుకుంటే నిబంధనలు పాటించాలనే భావన అందరిలో వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: