'తలైవి' జయలలిత  జీవితం ఆధారంగా, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో  తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ 'తలైవి'  అనే టైటిల్ తో  అమ్మ బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ బయోపిక్ లో  జయలలిత పాత్రలో  బాలీవుడ్ క్వీన్  కంగనా రనౌత్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం తమిళం కూడా నేర్చుకున్న ఈ బాలీవుడ్ క్వీన్ బాగా ఒళ్ళు కూడా చేస్తుందట. దాదాపు ఈ సినిమా కోసం కంగనా ఇరవై కిలోలు పెరగుతున్నట్లు తెలుస్తోంది. పైగా  జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె చివరి రోజులను కూడా చూపించనున్నారు. దాంతో కంగనా 16 ఏళ్ల వయసు పాత్ర నుండి నుండి 60 ఏళ్ల వయసు గల పాత్ర వరకూ ఈ సినిమాలో కనిపించనుంది. అసలు కంగనాను సీఎంగా చూస్తారా..?  అయితే జయలలిత లాంటి బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలంటే  కంగనా రనౌత్ లాంటి బలమైన నటి అయితేనే ఆ పాత్రకు పూర్తి  న్యాయం జరుగుతుంది. మరి జయలలిత పాత్రను  కంగనా రనౌత్ ఎలా మెప్పిస్తోందో చూడాలి.

 

ఇక  ఈ చిత్రం  తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా  విడుదలకానుంది. ఈ బయోపిక్ లో మిగిలిన కీలకమైన పాత్రలు  ఎం.జి.రామచంద్రన్ మరియు కరుణానిధి పాత్రలు. ఈ పాత్రలకు కూడా నటులను ఫైనల్ చేశారు. ఎం.జి.రామచంద్రన్  పాత్రలో  అరవింద్‌ స్వామి నటించబోతుండగా..  కరుణానిధి పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారట.  ఇక  త్వరలోనే ఈ సినిమా షూట్ కి రంగం సిద్ధం చేసుకుంటుంది.   కాగా ఈ బయోపిక్ బడ్జెట్  వంద కోట్లు అని తెలుస్తోంది.  ఎలాగూ  కంగనా రనౌత్ కి బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. అమ్మ బయోపిక్ కాబట్టి తమిళంలో కూడా భారీ డిమాండ్ ఉంటుంది.  ఇక తెలుగు కన్నడ మలయాళ పరిశ్రమల్లో కూడా ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. కాబట్టి వంద కోట్లుపెట్టినా  ఈజీగా రికవరీ అవుతాయని చిత్రబృందం భావిస్తోంది.  హాలీవుడ్ మూవీ 'డార్కెస్ట్ హవర్'కి మేకప్ మెన్ గా పనిచేసిన  'గ్యారీ ఓల్డ్ మెన్,  'అమ్మ' బయోపిక్  కూడా చెయ్యనున్నారు.  మరి ఎప్పుడూ వివాదాస్పద విషయాలతో  తన ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ  వార్తల్లో నిలిచే  కంగనా రనౌత్‌  జయలలిత పాత్రలో ఎలా ఉంటుందో.  


మరింత సమాచారం తెలుసుకోండి: