ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అష్టచమ్మా సినిమాతో టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన నాని, తొలి సినిమానే సూపర్ సక్సెస్ ని సాధించడంతో అక్కడి నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు సంపాదిస్తూ ముందుకు సాగారు. అయితే వచ్చిన అవకాశాలను చాలావరకు సఫలీకృతం చేసుకుంటూ, అభిమానులతో నాచురల్ స్టార్ గా పిలిపించుకుంటూ కెరీర్ పరంగా దూసుకెళ్తున్న నాని, ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. వచ్చేనెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇకపోతే ఈ సినిమాతో పాటు, 

ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు తో కలిసి 'వి' అనే సినిమాలో కూడా నాని నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి నాని, నిన్ననే షూటింగ్ లో జాయిన్ అయినట్లు సినిమా యూనిట్ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమాలోని నాని క్యారెక్టర్ విషయమై నేడు ఒక వార్త పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో నాని, కెరీర్ లో మొదటిసారి ఒక పక్కా నెగటివ్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఆయన నటిస్తున్న పాత్ర సినిమాకు హైలైట్ అని, అదే సినిమాలో ప్రధాన విలన్ పాత్ర అని కూడా ప్రచారం జరుగుతోంది. ఇక ఈ క్యారెక్టర్ నాని ఒప్పుకోవడానికి ఒకకారణం కూడా ఉందని అంటున్నారు, తన తొలి సినిమా అయిన అష్టచమ్మా సినిమాతో నటుడిగా తనకు అవకాశం ఇచ్చిన ఇంద్రగంటి గారు వి సినిమాకు దర్శకుడు కావడం మాత్రమే కాక, 

ఈ సినిమాలో తాను పోషించాలి అనుకున్న క్యారెక్టర్ ఆయనకు నచ్చడంతోపాటు, అది సినిమాకు ఎంతో కీలకం అని భావించి అందుకు ఒప్పుకున్నట్లు చెప్తున్నారు. అయితే నాని విలన్ గా నటిస్తున్న విషయమై వి సినిమా యూనిట్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, కొద్దిరోజలుగా ఈ సినిమాలో నానిది నెగటివ్ క్యారెక్టర్ అని ప్రచారం జోరుగా సాగుతుండడంతో, ఎక్కువ శాతం అది నిజమేనని అనిపిస్తోందని, అయినప్పటికీ ఆ సినిమా యూనిట్, పూర్తి వివరాలు ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే మొదటిసారి తమ హీరో, విలన్ గా నటిస్తున్న విషయం నిజమే అయితే, నాని ఫ్యాన్స్ కి ఇది కొంత షాకింగ్ విషయమే అని కూడా వారంటున్నారు....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: