సాహో.. ఈ  పేరు చెప్పగానే ఒళ్లు గగుర్పొడిచే సాహసాలు. హీరో బైక్, కార్ ఛేజింగ్ తో ఉర్రూతలూగించే సీన్స్ సినీ అభిమానుల్లో తెగ ఆసక్తిని పెంచేస్తున్నాయి. పైగా ఈ మూవీలో హీరో ప్రభాస్ కావడంతో ఆ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ఈ సినిమాపై ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో.. అంతే ఆసక్తి ప్రభాస్, శ్రద్ధాకపూర్ పై కూడా ఉంది.  

సాహో జోడీపై అంతకంతకూ ఆసక్తి క్రియేట్ అవుతోంది. ప్రభాస్, శ్రద్ధాకపూర్ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ అందరినీ మురిపిస్తోంది. శ్రద్ధాపై డార్లింగ్ కేరింగ్ సమ్ థింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. బీటౌన్ బ్యూటీ కూడా ప్రభాస్ రెస్పాన్సిబులిటీకి ఫిదా అవుతోందట. సాహో ప్రమోషన్ హంగామా షురూ అయ్యింది. ప్రమోషన్స్ లో ప్రభాస్, శ్రద్ధాకపూర్ కెమిస్ట్రీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. బీటౌన్ బ్యూటీ శ్రద్ధాకపూర్ తో ప్రభాస్ మసులుకునే తీరుకు ఆడియన్స్ ముచ్చటపడుతున్నారు. డార్లింగ్ ప్రభాస్ ప్రతి వేదికపైనా శ్రద్ధాతో కనిపిస్తుంటే ఫ్యాన్స్ లో అంతకంతకూ ఆసక్తి రెయిజ్ అవుతోంది. తెలుగు ట్రైలర్ ఈవెంట్ కోసం శ్రద్ధాకపూర్ హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ మళ్లీ తిరిగి ముంబై వెళ్లే వరకు ప్రభాస్ తీసుకున్న కేరింగ్ గురించి ఇపుడు అంతా ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారు. శ్రద్ధాపై ఈగ వాలనివ్వనంతగా డార్లింగ్ కేరింగ్ తీసుకున్నాడు. అసలే శ్రద్ధా ప్రభాస్ కు ఫిదా అయిపోయింది. అమేజింగ్ కోస్టార్! అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేసింది. 

మాములుగానే ప్రభాస్ లేడీ కోస్టార్స్ ని ఎంతో గౌరవంగా చూసుకుంటాడు. అందుకే ప్రభాస్ తో అనుష్కకు మంచి బాండింగ్ కుదిరింది. ఇపుడు ప్రభాస్, శ్రద్ధాకపూర్ కూడా మంచి ఫ్రెండ్ షిప్ కుదిరిందట. అందుకే తన కోస్టార్ కు ఏ ఇబ్బంది రాకుండా ప్రభాస్ హైదరాబాద్ లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేశాడట. ప్రభాస్ కేరింగ్ హీరోయిన్స్ ముచ్చటపడిపోతుంటే ఆడియన్స్ మాత్రం సమ్ థింగ్ అంటున్నారు. మరో 15రోజుల్లో బాక్సాఫీసు వద్ద సాహో సంచలనాలు మొదలవనుంది.  








మరింత సమాచారం తెలుసుకోండి: