ఫలక్‌ నుమా దాస్.. దర్శకుడు, నటుడు విశ్వక్ సేన్ కు క్రేజ్ తీసుకొచ్చిన సినిమా.. ఇప్పుడు ఈ నటుడు మరో కొత్త సినిమాకు శ్రీకారం చుడుతున్నాడు. ఇప్పటికే "టాటా బిర్లా మధ్యలో లైలా" ,"మేం వయసుకు వచ్చాం ", "సినిమా చూపిస్తా మామా" లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తో కలసి ఓ కొత్త సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇంతకీ ఈ సినిమా పేరేంటో తెలుసా.. పాగల్.. అవును పిచ్చెక్కించే టైటిల్ ఇదే.


నిర్మాత బెక్కెం వేణుగోపాల్ లక్కీ మీడియా బ్యానర్ పై రీసెంట్ గా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "హుషారు" తో మరో సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు విష్వక్ సేన్ కాంబినేషన్‌లో మరో క్రేజీ లవ్ స్టోరీ నిర్మించబోతున్నారు. ఈ మూవీ తో నరేష్ రెడ్డి కుప్పిలి అనే యంగ్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. క్రేజీ లవ్ స్టొరీ గా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ ద్వితీయార్థం నుండి మొదలుకానుంది.


ఈ సందర్బంగా నిర్మాత బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ .. "ఫలక్ నమా దాస్" లాంటి సూపర్ హిట్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన హీరో విశ్వక్ సేన్ తో మా లక్కీ మీడియా బ్యానర్ నెక్ట్ ప్రాజెక్ట్ చేయడం హ్యాపీ గా ఉంది. మా గత చిత్రం "హుషారు " సక్సెస్ మాకు మరిన్ని మంచి చిత్రాలు చేయడానికి, కొత్త వాళ్ళను ఇంట్రడ్యూస్ చేయడానికి మంచి ఉత్సాహన్నిచ్చింది. నరేష్ రెడ్డి కుప్పిలి చెప్పిన ఇంట్రెస్టింగ్ పాయింట్ కు అందరం బాగా కనెక్ట్ అయ్యాం.ఈ "పాగల్" మూవీ బెస్ట్ క్రేజీ లవ్ స్టొరీ అవుతుందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: