రెజీనా మరీ ఎడిక్ట్ అయిపోయింది. ఎవరేమనుకున్నా.. ఈ చెన్నై బ్యూటీ మాత్రం తగ్గడం లేదు. తన కెరీర్ కు లైఫ్ అండ్ డెత్ కావడంతో తనకు తాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేసుకుంటోంది. ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తూ పనిలో పనిగా జోరుగా ప్రమోషన్స్ కూడా చేస్తోంది. 

తెలుగులో బ్యూటీ రెజీనా స్టార్ హీరోగా వెలగాల్సింది. స్టార్ హీరోయిన్ కు కావాల్సిన అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న పాపం ఈ బ్యూటీ సక్సెస్ లే కరువయ్యాయి. అయినప్పటికీ రెజీనాకు టాలీవుడ్ లో సక్సెస్ కావాలనే ఆశ మాత్రం పోలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ లీడ్ రోల్ లో నటించిన ఎవరు సినిమా ఆగస్ట్ 16న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను రెజీనా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తోంది. ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ లో రెజీనా ప్రమోషన్ సూపర్ అనాల్సిందే. ఎందుకంటే ఎవరు సినిమా ఈ బ్యూటీ కెరీర్ కు చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రమోషన్ లో భాగంగా ఎక్కడికి వెళ్లినా  ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ పెట్టేసి తన ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. అంతేకాదు ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తోంది.

ఎవరు సినిమా పుణ్యమా అని రెజీనా ఇన్ స్టా గ్రామ్ కు అడిక్ట్ అయిపోయింది. ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా ఇన్ స్టా గ్రామ్ లో సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటూ ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతోంది. ఇప్పటికీ  అమ్మడికి ఇన్ స్టా గ్రామ్ లో మిలియన్ పైనే ఫాలోవర్స్ ఉన్నారు. ఇపుడు ప్రమోషన్ కంటిన్యూ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో పడింది. రెజీనా ఇలాగే అగ్రెసివ్ సోషల్ మీడియాలో టచ్ లో ఉంటే త్వరలోనే రెండు మిలియన్ ఫాలోవర్స్ మార్క్ దాటడం ఖాయం. 










మరింత సమాచారం తెలుసుకోండి: