బుడా పెస్టాలో కమల్ హాసన్ గారాల పట్టి పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తోంది. ఫ్రీ టైం దొరకడం చేతిలో పెద్దగా సినిమాలు కూడా లేకపోవడంతో శృతిహాసన్ ఆ ఫెస్ట్ ఈ ఫెస్ట్ అంటూ తెగ తిరిగేస్తోంది. అసలే మ్యూజిక్ లవర్ ఇంకేముందీ ఈ అమ్మడు మైకంతో ఊగిపోతోంది. 

సినిమా అవకాశాలు ఉన్నపుడు బిజీ కావడం.. లేదంటే ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఏదో పని చేసుకోవడం శృతిహాసన్ కు అలవాటైంది. శృతిహాసన్ తెలుగులో కనిపించి రెండేళ్లు దాటిపోతోంది. అయితేనేం సినిమాలు లేకపోయినా ఈ బ్యూటీ ఏదో విధంగా వార్తల్లో మాత్రం ఉంటోంది. అంతేకాదు ఈ ముద్దుగుమ్మ షికార్లకు కొదవేం లేదు. చేతిలో పెద్దగా సినిమా లేకపోడంతో ఫ్రీం టైమ్ ను లేట్ నైట్ పార్టీలోనూ గడిపేస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ బ్యూటీ బుడా పెస్టాలో డ్యాన్స్ చేస్తూ మైమరిచిపోతోంది. శృతి హాసన్ ప్రస్తుతం బుడా పెస్ట్ లో ఎంజాయ్ చేస్తోంది. అసలే మ్యూజీక్ లవర్ దీంతో ఈ మ్యూజిక్ ఫెస్ట్ ను తెగ ఆస్వాదిస్తోందట. గతంలో ఈ బ్యూటీ మ్యూజిక్ షోస్ కూడా కండక్ట్ చేసింది. సీజెట్ 2019 పేరుతో జరుగుతున్న మ్యూజిక్ ఫెస్టివల్ లో శృతిహాసన్ పర్ఫామెన్స్ కూడా ఇవ్వబోతోంది. ఈ ఈవెంట్ కు శృతి అటెండ్ అయిన ఫోటోలను ఓ వీడియోను సోషల్ మీడియాలో అభిమానుల కోసం షేర్ చేసింది.

ఆ మధ్య మళ్లీ సినిమాలు చేస్తానని స్టేట్ మెంట్ ఇచ్చిన శృతిహాసన్ ను ఎవరూ పట్టించుకోలేదు. తెలుగు నుండి ఈ బ్యూటీకి ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న లాభం సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాల సక్సెస్ మీదే శృతి కెరీర్ ఆధారపడి ఉంది. 








మరింత సమాచారం తెలుసుకోండి: