కాజల్ అగర్వాల్ – శర్వానంద్ – కళ్యాణి ప్రియదర్శిని జంటగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రణరంగం గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రేక్ష‌కుల్లో క్రేజ్ ఉన్న యంగ్ హీరో శ‌ర్వానంద్‌తో పాటు క్రేజీ హీరోయిన్లు కాజ‌ల్ అగ‌ర్వాల్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శిని కాంబోలో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి.


1990వ ద‌శ‌కం నాటి క‌థ‌తో ర‌ణ‌రంగం తెర‌కెక్కింది. సినిమాలో చాలా వాస్త‌వ క‌థ‌లు ఉంటాయ‌ని స‌మాచారం. రణరంగంలో శర్వానంద్ అతి తక్కువ కాలంలో డాన్ గా ఎలా మారాడు అనే పాత్రలో కనిపిస్తున్నాడు. ఓ పక్క లవర్ గా మరోపక్క డాన్ గా శర్వా లుక్స్ పై ఇప్పటికే ఆసక్తి వచ్చేసింది. ఇక కాజ‌ల్ - శ‌ర్వా కాంబోపై కూడా మంచి ఆస‌క్తి ఉంది. కాజల్ గ్లామర్ కూడా సినిమాకి ప్లస్ అయ్యేలా కనబడుతుంది. 


మరి అదే ఊపుతో రణరంగం బిజినెస్ కూడా జరిగింది. వరల్డ్ వైడ్ గా రణరంగం సినిమా రూ. 16 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. శ‌ర్వా సినిమాలు గ‌తంలో పెద్ద హీరోల సినిమాల‌కు పోటీగా వ‌చ్చి కూడా సూప‌ర్ హిట్ అయ్యి మంచి వ‌సూళ్లు రాబ‌ట్టాయి. మ‌రి ఇప్పుడు ఆగ‌స్టు 15 క‌లిసి రావ‌డంతో పాటు ఎవ‌రు సినిమాకు పోటీగా వ‌స్తోన్న శ‌ర్వా ఈ టార్గెట్‌ను ఎలా చేధిస్తారో ?  చూడాలి.


ఏరియా: బిజినెస్ (కోట్లలో)


నైజాం - 5.00


సీడెడ్ - 2.00


నెల్లూరు - 0.50


కృష్ణ - 1.00


గుంటూరు 1.20


వైజాగ్ - 1.50


ఈస్ట్ - 1.00


వెస్ట్ - 0.80


----------------------------
ఏపీ & టీఎస్ = 13.00
----------------------------


కర్ణాటక - 0.90


ఇతరప్రాంతాలు - 0.30


ఓవర్సీస్ - 1.80
---------------------------------------------
టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ = 16.00
---------------------------------------------


మరింత సమాచారం తెలుసుకోండి: