మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పీరియాడికల్ మూవీ 'సైరా నర్సింహారెడ్డి' ని ఎలాగైనా ఆక్టోబర్ 2 న థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.  విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో  ఈ చిత్రం యొక్క ప్రమోషన్స్ ను కూడా సార్ట్ చేస్తున్నారు.  ఈ రోజు మధ్యాహ్నం 3: 45గంటలకు  ఈసినిమాకు సంబందించిన మేకింగ్ వీడీయో ను విడుదలచేయనున్నారు.  ఇక  ఈ సినిమా విడుదలను భారీగా ప్లాన్ చేశారు. అందులో భాగంగా సైరా, హిందీ వెర్షన్ హక్కులను  ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీ ,  ఫర్హాన్ అక్తర్ లు సొంతంగా విడుదల చేస్తున్నారు.  వీరిద్దరూ ఇంతకుముందు  కన్నడ స్టార్ హీరో యష్ నటించిన 'కె జి ఎఫ్' హిందీ వెర్షన్ ను అక్కడ విడుదల చేయగా  ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. దాంతో ఇప్పుడు సైరా ను కూడా హిందీ లో భారీ స్థాయిలో  విడుదలచేయనున్నారు.  ఇక ఈచిత్రం తెలుగు, హిందీ తోపాటు కన్నడ , మలయాళ , తమిళ భాషల్లో కూడా విడుదలకానుంది.  


ఇక సైరా  టీజర్ ను   చిరంజీవి  పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22న   విడుదల చేయడం ఖాయంగా కనిపిస్తుంది.  స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి  జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్ రెడ్డి  తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా   బిగ్ బి అమితాబ్ బచ్చన్, చిరు కు గురువుగా నటిస్తున్నారు.  వీరితోపాటు మక్కల్ సెల్వన్  విజయ్ సేతుపతి , కిచ్చా సుధీప్,  మిల్కీ బ్యూటీ తమన్నా  ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్  త్రివేది  స్వరాలు సమకూరుస్తుండగా భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం ఫై  హీరో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.   

మరింత సమాచారం తెలుసుకోండి: