సౌత్ సూపర్ స్టార్ అనగానే రజినీకాంత్ గుర్తుకు వస్తారు.  రజినీకాంత్ సినిమాలు చేస్తూనే.. సామాజికంగా కూడా చాలా ముందు ఉంటారు.  తనకు వచ్చిన ఆదాయంలో ఎక్కువ భాగం ట్రస్ట్ లకు ఇచ్చేస్తుంటారు.  అంతేకాదు.. హిమాలయాలకు వెళ్లి అక్కడి హిమాలయ యోగులతో కలిసి ఉంటారు. ఎంత సంపాదించినా ఎంత పేరు తెచ్చుకున్నా.. సామాన్యుడిగా ఉండటానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు రజినీకాంత్.  అందుకే అయన సౌత్ సూపర్ స్టార్ అయ్యారు.  అయన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే సౌత్ మొత్తం పండుగ చేసుకుంటుంది.  


ఒక్క సౌత్ మాత్రమే కాదు.. అటు బాలీవుడ్ లో కూడా రజినీకాంత్ కు మంచి పేరు ఉన్నది.  ముఖ్యంగా ముంబైలో రజిని సినిమాలకు భారీ క్రేజ్ ఉన్నది.  రజిని సినిమాలు అక్కడ ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. ప్రస్తుతం రజినీకాంత్ మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ సినిమా చేస్తున్నారు.  ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.  


వచ్చే ఏడాది పొంగల్ కు సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.  ఇది పూర్తయ్యాక వెంటనే శివ దర్శకత్వంలో సినిమా ఉంటుంది.  దీన్ని పక్కన పెడితే.. రజినీకాంత్ గురించి అలనాటి హీరోయిన్, ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుమిత్ర కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.  రజినీకాంత్ కంటే ఈమె చాలా సీనియర్ ఆర్టిస్ట్.  అప్పటికే ఎన్నో సినిమాలు చేసింది.  హీరోయిన్ గా మెప్పించింది.  


తమిళంలో ఓ సినిమాలో రజినీకాంత్ ను హీరోగా తీసుకున్నారు.  రజినీకాంత్ అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్నాడు.  రజినీకాంత్ ను తీసుకెళ్లి సుమిత్రకు పరిచయం చేశారట యూనిట్.  ఈ అబ్బాయే ఈ సినిమాలో హీరోగా చేస్తున్నారని చెప్పారట.  సరే అని చెప్పిన సుమిత్ర పక్కన చైర్ చూపించి కూర్చోమని చెప్పగా.. రజినీకాంత్ వద్దని చెప్పి దూరంగా వెళ్లి అక్కడ కూర్చున్నారట.  


రజినీకాంత్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి.. సౌత్ సూపర్ స్టార్ గా ఎదగడానికి ఇదే కారణం అని, తనలో ఉన్న వినయ విధేయతలు ఆయన్ను హీరోగా నిలబెట్టాయని సుమిత్రగారు చెప్పారు.  ఇప్పటి హీరోలు ఒక్క సినిమా చేస్తే చాలు.. అన్ని మర్చిపోయి పక్కన కూర్చొని మాట కలుపుతారని చెప్పింది సుమిత్ర.  


మరింత సమాచారం తెలుసుకోండి: