ఈ మూవీలో రైతుల సమస్యలపై పోరాడే ఓ యువకుడి పాత్రలో నటించారు చిరంజీవి.  ఈ సినిమా అనుకున్న దానికన్నా ఎక్కువ సంచలనం సృస్టించింది.  అయితే కేవలం మెసేజ్ ఓరియెంటెడ్ గా ఉంటే బోర్ కొడుతుందని మాస్ పాత్రలో కూడా చిరంజీవి డ్యాన్స్, ఫైట్స్ తో మెప్పించారు.  ఆయన తదుపరి సినిమా ‘సైరా నరసింహారెడ్డి’.  బ్రిటీష్ వారిని గడ గడలాడించిన మొదటి తెలుగు స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా చేసుకొని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం మెగాస్టార్ ఎంతో కష్టపడుతున్నారు. 


ఈ  సినిమా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.  గాంధీ జయంతి సందర్బంగా అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా సైరా మేకింగ్ వీడియోను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది.  ఈ మేకింగ్ వీడియో 1.47నిమిషాల పాటు సాగింది.  రెండు సంవత్సరాల క్రితం మొదలు పెట్టిన ఈ షూటింగ్ ఎన్నో అడ్డంకులు..అవాంతరాలు దాటుకొని వచ్చింది. సైరా సినిమా షూటింగ్ సమయంలో మెగాస్టార్ ఎలా తన నట విశ్వరూపాన్ని చూపించారో వీడియోలో అర్థం అవుతుంది.


ఈ మూవీ కోసం  ఉపయోగించిన దుస్తులు, వారు ఉపయోగించిన కత్తులు, ప్రధాన తారాగణం గెటప్‌లె మొత్తాన్ని చూపించారు. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, రవి కిషన్, తమన్నా,నిహారిక తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఎప్పటి నుంచో ఉన్న మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. మొత్తానికి మెగాస్టార్ ఎంతో ప్రతిష్టాత్మక మూవీ తెరపై చూడటానికి మెగా ఫ్యాన్స్ ఎంతో ఉవ్విళ్లూరుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: