యూనివర్సల్ స్టార్  ప్రభాస్ హీరోగా  అత్యంత భారీ బ‌డ్జెట్ తో  హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన్న  'సాహో' చిత్రం పై  టాలీవుడ్ లో  ఎంత క్రేజ్ ఉందో  ఒక రకంగా బాలీవుడ్ లోనూ అంతే  క్రేజ్ ఉన్నట్లు కనిపిస్తుంది అక్కడి పరిస్థితులు.  ఇప్పటికే బాలీవుడ్ లో  చాలామంది ప్రముఖుల కళ్ళు ఈ సినిమా పై ఉన్నాయి. బాహుబలి సినిమాతో ప్రభాస్ బాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే.  ఆ సినిమా అక్కడ భారీ హిట్ అందుకోవడంతో  హిందీ స్టార్ హీరోలకు ఏ మాత్రం మింగుడు పడలేదు. అందుకే మనస్ఫూర్తిగా బాహబలి సినిమాని మరియు ప్రభాస్ ను పొగడటానికి కూడా  బాలీవుడ్ ఖాన్ లకి మరియు మిగిలిన స్టార్స్ కి  ఇష్టం లేకపోయింది. ఇప్పుడు మళ్లీ  ప్రభాస్ నుండి మరో సినిమా వస్తుంది.  ఇప్పటికే 70 మిలియన్స్ వ్యూస్ తో దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది సాహో ట్రైలర్. ఇక సినిమాలో మంచి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయటం ఖాయం. ఇదే కనుక జరిగితే బాలీవుడ్ లో మార్పు తప్పక కనిపిస్తుంది.  ఈ సినిమాలో  హీరోయిన్ శ్రద్ద కపూర్, నిర్మాణ సంస్థ కూడా టి సిరీస్ కావటంతో బాలీవుడ్ స్టార్స్ సాహో గురించి స్పదించక తప్పదు. అదే కనుక జరిగితే ప్రభాస్ రేంజ్ మరింతగా పెరిగిపోవటం ఖాయం. 


ఇప్పటికే కరుణ్ జోహార్, బోణి కపూర్ లాంటి వాళ్ళు  ప్రభాస్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ వాళ్ళకి డేట్స్ ఇస్తే.. బాలీవుడ్ మీద దక్షణాది డామినేషన్ సృష్టంగా కనిపించే అవకాశం ఉంది. దీనికి తోడు మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా  రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో అమితాబ్ కీలక పాత్రలో కనిపిస్తోన్నారు. దాంతో ఈ సినిమా పై కూడా బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. వీటితో పాటు ఎలాగూ దర్శక ధీరుడు  రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా  రాబోతున్న  భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్' ఉండనే ఉంది.   ప్రస్తుతం శరవేగంగా  షూటింగ్ జరుపుకుంటుంది ఈ బడా మల్టీస్టారర్. పైగా ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. అలాగే  ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో, చరణ్ అల్లూరి పాత్రలో  కనిపించబోతున్న సంగతి తెలిసిందే.  ధృడంగా ఉండే  కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ మరోసారి లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేస్తున్నాడు. అలాగే చరణ్ కూడా అచ్చం అల్లూరిలానే సినిమాలో కనిపించే విధంగా ఇప్పటికే రాజమౌళి తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ లెక్కన ఈ సినిమాలు హిందీలో భారీ వసూళ్ల సాధించడం ఖాయం. అప్పుడు  బాలీవుడ్ కి ప్రేరణ  టాలీవుడే అవుతుంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: