జాతీయ అవార్డు దక్కడం అంటే ఆశామాషీ వ్యవహారం కాదన్న సంగతి అందరికి తెలిసిందే. ఉత్తమ నటిగా పరిశ్రమను ఆకట్టుకోవడమే కాదు చేసిన పాత్ర చిరకాలం గుర్తుండిపోతుంది. ముఖ్యంగా అలాంటి అవకాశం దక్కడం కూడా గొప్ప విషయం. ఈ విషయంలో కీర్తి సురేష్ చాలా అదృష్టవంతురాలని చెప్పక తప్పదు. ఎంతమందినో కాదనుకొని మహానటి సావిత్రి పాత్రకు ఎంతగానో నమ్మి కీర్తిని ఎంపిక చేసుకున్నారు దర్శక నిర్మాతలు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టడమే కాదు అతి తక్కువ కాలంలోనే ఉత్తమనటిగా మహానటి చిత్రానికి జాతీయ అవార్డ్ ను దక్కించుకుంది కీర్తి సురేష్. అంతేకాదు ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకొని తన స్థాయిని బాగా పెంచేసుకున్న కీర్తీ సురేష్ ఇప్పుడు లేడీ ఓరియెంటెండ్ సినిమాలతో చాలా వేగంగా దూసుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఆమెకు జాతీయ నటిగా అలా పురస్కారం లభించగానే మరో సినిమా అనౌన్స్ అవడం ఆసక్తికరమైన విషయం. ఇప్పటికే కీర్తీ సురేష్ కు ఊపిరి తీసుకోలేనంతగా చేతినిండా సినిమాలున్నాయి. తెలుగులో రెండు సినిమాలు చేస్తున్న కీర్తీ.. తమిళంలో విజయ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మోహన్ లాల్ హీరోగా మలయాళంలో రూపొందుతున్న ఒక సినిమాలో కూడా కీర్తీ హీరోయిన్ గా నటిస్తోంది. వీటితో పాటు త్వరలోనే మరో సినిమా ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాని తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ నిర్మిస్తున్నాడు. రీసెంట్‌గా రజనీకాంత్ 'పేట' సినిమాను తెరకెక్కించిన కార్తిక్ సుబ్బరాజ్ నిర్మాతగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. 

అయితే ఈ సినిమా థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కబోతుందని తాజా సమాచారం. ఇక ఈశ్వర్ కార్తిక్ అనే వ్యక్తి ఈ సినిమాతో దర్శకుడుగా మారబోతున్నాడట. ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో థ్రిల్లర్ సినిమాలకూ, ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ గా రూపొందుతున్న థ్రిల్లర్ సినిమాల కు ప్రస్తుతం ఆదరణ బావుంది. ఇప్పుడు ఇదే జానర్ లో తెరకెక్కబోతున్న సినిమాతో  కీర్తీ సురేష్ పేరు కూడా మార్మోగబోతోందని కోలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: