దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా సాహో. ప్రభాస్, శ్రధ్ధా కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 30 వ తేదీన విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సాహో సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. ప్రపంచవ్యాప్తంగా 333 కోట్ల రుపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది సాహో. సాహో సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ అన్ని భాషల్లో 100 కోట్ల రుపాయలకు అమ్ముడయినట్లు తెలుస్తోంది. 
 
ప్రపంచవ్యాప్తంగా పదివేల థియేటర్లలో సాహో సినిమా విడుదలవుతోంది.కానీ సాహో సినిమాకు పైరసీ రూపంలో సమస్య ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సినిమాలు రిలీజ్ అవటం ఆలస్యం సాయంత్రంలోపు ఆన్ లైన్లో పైరసీ ప్రింట్ లభ్యమవుతోంది. ఆన్ లైన్లో పైరసీ ప్రింట్ లభిస్తూ ఉండటంతో కొంతమంది ప్రజలు ఆన్ లైన్లోనే సినిమాను వీక్షిస్తున్నారు. పైరసీ వలన సినిమా నిర్మాతలు కోట్ల రుపాయలు నష్టపోతున్నారు. 
 
సినిమా పైరసీ కాకుండా నిర్మాతలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అవేవీ సఫలం కావట్లేదు. కానీ సాహో నిర్మాతలు పైరసీ వెబ్ సైట్లపై తగిన చర్యలు తీసుకుంటే సాహో సినిమా పైరసీ కాకుండా ఆపే అవకాశం ఉంది. బాహుబలి, బాహుబలి2, రోబో 2.0 లాంటి భారీ బడ్జెట్ సినిమాలు కూడా పైరసీ వలన కోట్ల రుపాయలు నష్టపోయాయి. సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 18వ తేదీన రామోజీ ఫిలిం సిటీలో జరగబోతుంది. 
 
సాహో సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు దాదాపు 100 కోట్ల రుపాయల లాభం వచ్చినట్లు సమాచారం. సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నిర్మాతలు కోటీ 70 లక్షల రుపాయలు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తరువాత సినిమా విడుదలయ్యే వరకు అన్ని భాషల్లో ప్రమోషన్లు నిర్మాతలు ప్లాన్ చేసారని సమాచారం. బాహుబలి, బాహుబలి2 సినిమాల తరువాత సాహో సినిమాతో ప్రభాస్ మరో ఇండస్ట్రీ హిట్ కొడతాడని ప్రభాస్ అభిమానులు ఆశిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: