భారతదేశ చరిత్రలోనే అతి పెద్ద యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 'సాహో' ఈనెల ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి లాంటి భారీ హిట్ తో 'పాన్ ఇండియా స్టార్' ఇమేజ్ సంపాదించుకున్న ప్రభాస్ పరిస్థితి ఇప్పుడు సంకటంలో పడింది. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ మరియు అబ్బురపరిచే విజువల్స్ వల్ల సినిమా అటూ ఇటుగా ఆడినా ఆ మొత్తాన్ని తిరిగి రాబట్టుకోగలదు. మరి ఇక్కడ ప్రభాస్ కి వచ్చిన నష్టం ఏమిటి?

ప్రభాస్ తో 350 కోట్ల బడ్జెట్ తో సినిమా చేసేందుకు ప్రొడ్యూసర్లు ధైర్యం ఎక్కడినుండి వచ్చింది. బాహుబలి ద్వారా దేశవ్యాప్తంగా అతనికి వచ్చిన పేరు కాదా? ముందుగా ఇక్కడ గమనించాల్సింది ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి అని. అవును టాలీవుడ్ లో రాజమౌళి హీరోలు అంటూ ఒక స్పెషల్ కేటగిరీ ఉంది. ఆయనతో హిట్లు కొట్టిన చాలామంది స్టార్ హీరోలుగా ఎదగలేకపోయారు.

మచ్చుకు నితిన్ నే తీసుకుందాం. సై లాంటి సినిమా తరువాత నితిన్ కి కనీసం టైర్-2 హోదా కూడా లేదు. మర్యాద రామన్న ఇచ్చిన ప్రేరణతో సునీల్ కథానాయకుడిగా ఎన్నో సార్లు విఫలమయ్యాడు. 'ఈగ' నాని…అంత టాలెంట్ పెట్టుకొని కూడా భారీ వసూళ్లు సాధించలేకపోతున్నాడు. దానికి కారణం అతనితో సినిమా తరువాత వారిపై విపరీతంగా పెరిగిన అంచనాలు.

ఇక్కడ పాయింట్ ఏమిటంటే… టాలీవుడ్ కి ప్రభాస్ రేంజ్ తెలుసు. కానీ బయట ఇండస్ట్రీ అభిమానులకు అతను 'బాహుబలి ప్రభాస్'. ఇప్పుడు 'సాహో' హిట్ అయితే ఆ మార్క్ పోతుంది. రానున్న ప్రభాస్ సినిమాలకు మరింత క్రేజ్ వచ్చి అతనిని శాశ్వతంగా నేషనల్ స్టార్ ని చేసేస్తుంది సాహో.అదే కనుక సాహో ఫ్లాప్ అయితే బాలీవుడ్ సహా అన్నీ ఇండస్ట్రీ ప్రజలు ప్రభాస్ ను పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఇప్పటికే కేరళ లో ఆంధ్రను మించి మన రెబల్ స్టార్ కి భారీ కట్అవుట్ లు వేయడం స్టార్ట్ చేశారు. వాటి లెంగ్త్ మరింత పెరగాలంటే సాహో తప్పక హిట్ కావాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: