టాలీవుడ్ సినిమా పరిశ్రమకు 1978వ సంవత్సరంలో ప్రాణం ఖరీదు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి, మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి, ఆ తరువాత కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా  తన నటనతో మెప్పించి, ఆపై హీరోగా మారి సినిమాలు చేయడం మొదలెట్టారు. అయితే హీరోగా మెల్లగా సినిమాలు చేయడం మొదలెట్టిన చిరంజీవి, వచ్చిన అవకాశాలను ఒక్కొక్కటిగా ఒడిసిపట్టుకుని తన టాలెంట్ తో ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎదిగి సుప్రీమ్ హీరోగా, అనంతరం మెగాస్టార్ గా అభిమానుల, మరియు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 

ఇక ఈనెల 22వ తేదీన ఆయన తన 64వ జన్మదినాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, 21వ తేదీ సాయంత్రం, హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో మెగాస్టార్ జన్మదిన వేడుకలను భారీస్థాయిలో నిర్వహించనున్నట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. అంతేకాక ఈ వేడుకకు మెగాస్టార్ కుటుంబసభ్యులతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా హాజరు కానున్నారని అంటున్నారు. అందుకోసం అప్పుడే ఏర్పాట్లు కూడా మంచి జోష్ తో జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇకపోతే నేడు రిలీజ్ అయిన మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి టీజర్ ని, రేపటి వేడుకలో ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారట. అలానే పవర్ స్టార్ కూడా, తన అన్నయ్య చిరంజీవి గురించి కూడా మాట్లాడనున్నట్లు సమాచారం అందుతోంది. 

ఇక ఆ వేడుక కోసం మెగాఫ్యాన్స్ కు అప్పుడే పాసుల జారీ ప్రక్రియ కూడా ప్రారంభమయినట్లు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్త నిజమేనని కొందరు సినిమా విశ్లేషకులు కూడా చెప్తున్నప్పటికీ, ఈ వార్తపై మెగా ఫ్యామిలీ నుండి ఒక అధికారిక ప్రకటన వెలువడితేనే కానీ నమ్మలేం. అయితే ఒకవేళ ఇది నిజం అయితే మాత్రం, ఒకేసారి మెగాస్టార్, పవర్ స్టార్ సహా,మెగా ఫ్యామిలీ మొత్తాన్ని చూసే అవకాశం మెగా ఫ్యాన్స్ కు దక్కబోతుందన్నమాట....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: