2019 సంవత్సరంలో భారీ అంచనాలతో విడుదలవుతున్న సినిమాలు సాహో మరియు సైరా. రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలున్నాయి. ఈ రెండు సినిమాలకు హిట్ టాక్ వస్తే చాలు కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయనడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఇప్పటికే విడుదలైన సాహో టీజర్, ట్రైలర్ సైరా నరసింహారెడ్డి టీజర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాలపై భారీగా అంచనాలు పెంచేసాయి. 
 
మరి ఈ సినిమా ఫలితం గురించి భయం లేదా అనే ప్రశ్నకు ప్రభాస్, చిరంజీవి వేరు వేరు సమయాల్లో సమాధానాలు ఇచ్చారు. సాహో లాంటి భారీ బడ్జెట్ సినిమాలు చేసిన సమయంలో భయం తప్పనిసరిగా ఉంటుంది. సాహో సినిమా కోసం నటీ నటులు, టెక్నీషియన్లు, నిర్మాతలు ఎంతో కష్టపడ్డారు. వీరి కష్టానికి తగిన ఫలితం వస్తుందో రాదో అనే భయం తప్పనిసరిగా ఉంటుందని ప్రభాస్ అన్నారు. మరికొన్ని సంవత్సరాల పాటు భారీ సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రభాస్ తెలిపారు. 
 
చిరంజీవి కూడా సైరా సినిమా గురించి మాట్లాడుతూ పది సంవత్సరాల క్రితమే ఈ సినిమా కథ తయారయిందని కానీ భారీ బడ్జెట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ సినిమాను ఆపేశామని తెలిపారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి మరియు రామ్ చరణ్ భయాన్ని పోగొట్టారని చిరంజీవి అన్నారు. సాహో సినిమాకు 350 కోట్ల రుపాయల బడ్జెట్ కాగా సైరా నరసింహారెడ్డి సినిమాకు 270 కోట్ల రుపాయలు ఖర్చు పెట్టారు నిర్మాతలు. 
 
32 రోజుల గ్యాప్ తో ఈ రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ప్రభాస్, చిరంజీవి కెరీర్లలో ఈ సినిమాలు హైయెస్ట్ బడ్జెట్తో తెరకెక్కాయి. ఈ సినిమాలు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కాబోతున్నాయి. విడుదలైన తరువాత ఈ రెండు సినిమాలు ఏ స్థాయి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: