బాలీవుడ్ లో విజయం సాధించిన 'క్వీన్' సినిమాను తెలుగుతో పాటు సౌత్ మూడు భాషల్లోను ఈ సినిమాను రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తమిళ 'క్వీన్' రీమేక్ ను 'పారిస్ పారిస్' అనే పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలోని కంగనా పాత్రలో కాజల్ నటించింది, ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చూసి సౌత్ మొత్తం ఆశ్చర్యపోయింది. కాజల్ ఏంటి అడల్ట్ రేటెడ్ సినిమాలో నటించడం ఏంటి అని.                                             


ఈ విషయాన్నీ పక్కన పెడితే .. ఈ సినిమా ట్రైలర్ లో చూపించిన దానికంటే సినిమాలో చాలానే ఇలాంటి హాట్ అండ్ బోల్డ్ సీన్లు కనిపించాయి అని అందుకు అందులో చాలా కట్ చెయ్యాల్సి ఉంటుంది అని సెన్సార్ బోర్డ్ తెలిపింది. దీంతో కాజల్ అగర్వాల్ ఫైర్ అవుతోందట. ఒరిజినల్ సినిమాలో ఎలాంటి డైలాగ్లు ఉన్నాయో అచ్చం అలంటి డైలాగులు, సీన్లు ఇక్కడ తీశామని,


తాను ఎంతో కష్టపడి నటిస్తే ఇలా కత్తిరించడం తనకు నచ్చలేదని, సినిమాలో అన్ని సీన్స్ కట్ చేస్తే ఇంకా సినిమాలో చుసేకి ఏముంటుంది అని సెన్సార్ బోర్డుపై ఆగ్రహించిందట కాజల్ అగర్వాల్. హీరోయిన్ గా ఆమెకు అవకాశాలు తగ్గుతుండడంతో తనలోని హాట్ నెస్ ని ప్రదర్శించాలని కాజల్ అలాంటి సన్నివేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తున్నాయి. మరి సెన్సార్ వివాదంలో చిక్కుకున్న ఈ సినిమా ఎప్పుడు బయటికి వస్తుందో చూడాలి. ఏది ఏమైనా కాజల్ అంత కష్టపడితే ఇలా కట్ చెయ్యడం అస్సలు బాలేదని కాజల్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: