గత కొంత కాలంగా సినీ పరిశ్రమలో ఎన్నో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అన్ని సినీ పరిశ్రమలో ఎవరో ఒక ప్రముఖులు చనిపోవడం జరుగుతుంది.  ప్రమాదాలే కావొచ్చు..అనారోగ్యంతో, ఆత్మహత్యలతో, అనుమానాస్పద మృతి. ఇలా ఏదో ఒక కారణంతో మరణాలు సంబవిస్తున్నాయి. తాజాగా హాలీవుడ్ నిర్మాత అనుమానాస్పద స్థితిలో ఓ సరస్సులో శవమై తేలారు.   శనివారం పియోటిర్‌ వొజ్నియాక్‌ మిస్సింగ్‌ కేసు నమోదైంది. కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు కిసజ్నో సరస్సుకు సమీపంలో ఖాళీగా ఉన్న మోటార్‌ బోటును గుర్తించారు. 

వ్యాపార రంగంలో ఆయన మంచి పొజీషన్లో ఉండగానే సినీ రంగంలోకి అడుగు పెట్టారు.  ఈ నేపథ్యంలో సినీ నిర్మాత పియోటిర్‌ వొజ్నియాక్‌-స్టారక్‌ రాణిస్తున్న సమయంలో ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం హాలీవుడ్ అభిమానుల హృదయాలను కలచి వేస్తుంది. అయితే ఇది ఎలా జరిగింది..ఆయన అనుకోని ప్రమాదంలో పడ్డారా? లేదా ఏదైనా ఇతర కారణాల వల్ల చనిపోయి ఉంటారా అన్న విషయంపై కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు కిసజ్నో సరస్సును జల్లెడ పడుతున్నారు.

చుట్టు పక్కల ఏమైనా అనుమానాస్పద వస్తువులు కానీ..జాడలు కానీ లభిస్తాయనన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కిసజ్నో సరస్సుకు సమీపంలో ఖాళీగా ఉన్న మోటార్‌ బోటును గుర్తించారు. పియోటిర్‌ వొజ్నియాక్‌ కనిపించకుండా పోయారన్న ఫిర్యాదు అందగానే ఈశాన్య పోలండ్‌ ప్రాంతంలో ఉన్న కిసజ్నో సరస్సు పరిసర ప్రాంతాల్లో గాలించగా..నీటిపై తేలియాడుతన్న శవాన్ని గుర్తించారు. డెడ్‌బాడీని వెలికితీసి పియోటిర్‌ వొజ్నియాక్‌దిగా గుర్తించామని పోలండ్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి జరొస్లా జీలిన్‌స్కీ తెలిపారు.


పియోటిర్‌ వొజ్నియాక్‌ పోలండ్‌లో పలు పాపులర్‌ సినిమాలను తెరకెక్కించారు. పియోటిర్‌ పినతండ్రి జెర్జీ స్టారక్‌ పోలండ్‌లోనే అత్యంత ధనవంతుడిగా పేరుగాంచారు. పియోటిర్‌ వొజ్నియాక్‌ ఆకస్మిక మరణం పట్ల జరొస్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: