చిరంజీవి తన సినిమాల్లోని మాస్ కంటెంట్ కంటే తన క్యారెక్టర్ కే మాస్ అప్పీల్ ఇవ్వగల మేధావి. మాస్ ప్రేక్షకుల గుండెల్లో చిరంజీవి తిష్ట వేసుకుని కూర్చోవడానికి ఇదొక కారణం. ఆయన పలికే మాస్ డైలాగ్స్, మేనరిజమ్స్, ఎక్స్ ప్రెషన్స్ కి ఫాన్స్ ఫిదా అయిపోతూంటారు. తొంభైల్లో ఆయన సినిమాల్లో పలికిన మేనరిజమ్స్ ఇప్పటికీ పాపులరే.

 

గ్యాంగ్ లీడర్ లో 'చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉందో.. రఫ్ఫాడించేస్తా' అనే డైలాగ్ మోస్ట్ పాపులర్. చిరంజీవిని మెగాస్టార్ క్రేజ్ నుంచి మరింత ఎత్తుకు తీసుకెళ్లిన సినిమా అది. రౌడీ అల్లుడు లో 'బాక్సు బద్దలైపోద్ది' అప్పటికీ ఇప్పటికీ ఏ సినిమా బాక్సాఫీసు కలెక్షన్ల గురించైనా వచ్చే మాట. చిరంజీవి ఈ డైలాగ్ పలికిన తీరు, ఆ క్యారెక్టర్, చిరంజీవి మాస్ ఎలివేషన్ ఆయన మాస్ అప్పీల్ కో ఉదాహరణ. జేబుదొంగలో 'గొప్పోడివి మరి..' డైలాగ్ పాపులర్. ఘరానామొగుడు లో 'ఫేస్ ఫుల్ టర్నింగ్ ఇచ్చుకో' అనే మేనరిజం ఇప్పటికీ అందరి నోటా పలుకుతూనే ఉంటుంది. ఆ సినిమాలో బంగారు కోడిపెట్ట సాంగ్ చిత్రీకరణ వైజాగ్ లో జరుగుతూండగా ఆయన అభిమాని ఒకరు 'బాసూ ఫేస్ టర్న్ ఇచ్చుకో' అన్నారట. అదే డైలాగ్ ను ఆ సినిమాలో పెట్టుకున్నారు చిరంజీవి. అల్లుడా మజాకా లో 'టాప్ లేచిపోద్ది' హిట్లర్ లో 'అంతోద్దు.. ఇది చాలు' అనే మేనరిజం కూడా ఫేమస్. ఇద్దరు మిత్రులులో 'అంత డెకరేషన్ లేదు'.. ఇవన్నీ మెగాస్టార్ నోటి నుంచి వచ్చి పాపులర్ అయ్యాయి.. చిరంజీవిని మాస్ హీరోను చేశాయి.

 

ఎనభై, తొంభైల్లో.. 'నువ్ పెద్ద చిరంజీవి.. మరి'.. 'చిరంజీవి లా ఫీలైపోతున్నావ్'.. అని సాధారణంగా ప్రజలు నోటి నుంచి వచ్చేవి. అంతగా ప్రజలు చిరంజీవి సినిమాలను ఓన్ చేసుకునేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి: