'బాహుబలి' తర్వాత భారీ స్థాయిలో ప్రభాస్ నటిస్తున్న 'సాహో' సినిమా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల కానుంది. 'బాహుబలి' సినిమా దేశవ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ కావడంతో మంచి క్రేజ్ సంపాదించిన ప్రభాస్ అదే స్థాయిలో హిట్టు కొట్టాలని సాహో సినిమా చేయడం జరిగింది. యాక్షన్ ఎపిసోడ్ బేస్ ఎక్కువ కలిగిన ఈ స్టోరీ లో ప్రభాస్ చేసిన ఫైట్లు యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ యాక్షన్ సినిమా ని తలపిస్తాయి అని అంటున్నారు సినిమా యూనిట్ కి చెందిన వారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు చాలా శరవేగంగా సాగుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా బాహుబలి రికార్డులను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.


ప్రభాస్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది సాహో. ఈ నేపథ్యంలో ఆగస్టు 30న విడుదల కాబోతున్న ఈ సినిమా టికెట్లు రేట్లు అంబరాన్ని అంటుతున్నాయి. సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న నేపథ్యంలో వారి అభిమానాన్ని క్యాష్ చేసుకోవడం కోసం థియేటర్ యజమానులు 500 నుంచి వెయ్యి రూపాయల వరకు టికెట్ రేట్ అమ్ముతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ముఖ్యంగా అర్ధరాత్రి బెనిఫిట్ షో లకు ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకుని ఇంత భారీ రేటుతో టికెట్ అమ్మాలని థియేటర్ యాజమాన్యం ఇప్పటికే డిసైడ్ అయినట్లు సమాచారం.


ఇదే క్రమంలో విడుదలైన తొలి వారంలో రెండుసార్లు అదనపు గా వేసుకుని భారీ మొత్తంలో వసూలు చేయడానికి ప్రభుత్వాల నుండి అనుమతులను కూడా సాహో సినిమా టీం తీసుకున్నట్లు సమాచారం. ఏపీలో గత ప్రభుత్వం నుంచి ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. కొత్త ప్రభుత్వం వచ్చాక ఇలా అదనపు షోలు వేసి, టికెట్ల రేట్లు పెంచాల్సిన అవసరం ‘సాహో’కే పడింది. ఆల్రెడీ పర్మిషన్ల కోసం దరఖాస్తులు కూడా వెళ్లిపోయాయి. మరి జగన్ సర్కారు అనుమతులు ఇస్తుందా లేదా అన్నది ఆసక్తికరం. చిత్ర వర్గాలు, డిస్ట్రిబ్యూటర్ల సమాచారం మేరకు ఏపీలో తొలి వారం మొత్తం ‘సాహో’ టికెట్ రేటు రూ.200గా ఉండబోతున్నట్లు సమాచారం. మొత్తం మీద చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహో సినిమా టికెట్ రేట్లు షాక్ కొట్టేలా ఉన్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: