ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఒక్కో దగ్గర ఒక్కో టాక్ తో రన్ అవుతుంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి డివైడ్ టాక్ రావడంతో సినిమా పని అయిపోయిందనే అనుకున్నారు. కానీ అనూహ్యంగా సినిమా వసూళ్ళు ఒక రేంజ్ లో ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా దుమ్ము దులుపుతుంది. బాలివుడ్ క్రిటిక్స్ ఈ సినిమాకి దారుణమైన రేటింగ్స్ ఇచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. సినిమా వచ్చిన టాక్ ని బట్టి చూస్తే ఈ రేంజ్ వసూళ్ళు రావడం ఆశ్చర్యకరమే.


ప్రభాస్ సాహో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. విడుదలైన మొదటి రోజునుండి సాహో కలెక్షన్స్ స్థిరంగా కొనసాగుతున్నాయి. సాహో విడుదలై ఏడురోజులు పూర్తయిన నేపథ్యంలో మొదటివారానికి గాను 116కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది. దక్షిణాది హీరో మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకొని ఈ రేంజ్ వసూళ్లు సాధించడం మాములు విషయం కాదు. దీంతో బాహుబలి ద్వారా ప్రభాస్ సంపాదించుకున్న పాపులారిటీని అర్థం చేసుకోవచ్చు.


కానీ తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్ లో సాహో వసూళ్లు అంత ఆశాజనకంగా లేవు. కొన్ని చోట్ల సాహో భారీ నష్టాలు మిగిల్చేలా ఉంది. సాహో ఓపెనింగ్ కలెక్షన్స్ భారీగా రాబట్టినప్పటికీ అత్యధిక ధరకు హక్కులు అమ్ముడైన కారణంగా సాహో రాబట్టాల్సిన లెక్క ఇంకా చాలా ఉంది. కానీ హిందీలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. విడుదలైన మొదటి రోజు నుండి కలెక్షన్లు స్టడీగా కొనసాగుతున్నాయి.


మొదటి రోజు 24.40 కోట్ల వసూళ్లు సాధించిన సాహో రెండవ రోజు 25.20 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఆదివారం అత్యధికంగా 29.48 కోట్ల వసూళ్లు సాధించింది. సోమవారం నుండి వరుసగా 14.20 కోట్లు, 9.10కోట్లు, 6.90కోట్లు , 6.75కోట్ల వసూళ్లతో అదరగొట్టింది. ఈ ఏడాదికి అత్యధిక మొదటివారం వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాలుగవ స్థానంలో ఉంది. ముందు ముందు మరిన్ని రికార్డులు సాధించే దిశగా దూసుకుపోతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: